75 ఏండ్ల స్వాతంత్రం ఎందరికో!!

‘‘‌భారత దేశంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఉద్యోగాలను కల్పించలేక నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలో డెమోగ్రఫీ డివిడెంట్‌ ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉన్నది ఇలా అత్యధికంగా డెమోగ్రఫీ డివిడెంట్‌ ఉన్నా కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేక నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వాలనే అంధకారంలోకి నెట్టు వేయబడుతున్నాయి విపరీతంగా పెరుగుతున్న నిరుద్యోగ సమస్య వల్ల పేదరికం పెరగడానికి పరోక్షంగా దోహదపడుతుంది’’

క్రీస్తు శకం 1600 సంవత్సరాల ప్రారంభంలో భారతదేశాన్ని బ్రిటిష్‌ ‌వారు తమ వలస రాజ్యాంగ ఏర్పరచుకొని వ్యాపారం ప్రారంభించారు ఇలా వ్యాపారాన్ని ప్రారంభించిన ఆంగ్లేయులు క్రమక్రమంగా భారతదేశ రాజుల అనైక్యతను ఆసరగా చేసుకొని పరిపాలన వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం జరిగింది ఇలా భారతదేశంలో ఆంగ్లేయులు 1757 సంవత్సరంలో జరిగిన ప్లాసీ యుద్ధం ద్వారా భారత దేశ పరిపాలన వ్యవహారాలు ఆంగ్లేల చేతిలోకి వెళ్లడం జరిగింది పాలన అధికారాలను అష్టగతం చేసుకున్న బ్రిటిష్‌ ‌వారు భారతీయ ప్రజల మీద అనేక రకాలైన పన్నులు విధించి వివక్షపూరితమైన ధోరణి ప్రదర్శించడం వల్ల భారతీయ ప్రజలు అభద్రత భావానికి గురి కావడం జరిగింది ఇలాంటి తరుణంలో భారత దేశంలో ఉన్నటువంటి ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి చెలరేగి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు ఉద్యమాలు సత్యాగ్రహాల ద్వారా బ్రిటిష్‌ ‌పాలకుల నుండి 1947 ఆగస్టు 15న విడిపించుకుని స్వేచ్ఛ స్వాతంత్రాలను భారతీయ ప్రజలు పొందడం జరిగింది 1947 నుండి 2022 వరకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర వజ్రోత్సవాలను ఎన్డీఏ ప్రభుత్వం జరుపుకోవడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే కానీ ఇలాంటి తరుణంలో నిజమైన స్వాతంత్ర ఫలాలు ఎవరికి అందాయి.

అభివృద్ధి నిరుద్యోగం పేదరికం ఆర్థిక సమానతలు మొదలైనటువంటి అనేక అంశాలు భారత సమాజాన్ని పట్టిపీడిస్తున్న చీడపురుగుల వలె తయారయ్యాయి వీటన్నిటికీ కారణం ప్రభుత్వాల రాజకీయ నాయకుల ప్రభుత్వ పథకాలను అమలుపరుస్తున్న ప్రభుత్వ అధికారుల నే ప్రశ్న మొదలవుతుంది 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న భారతదేశానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది అలాంటి దాంట్లో మొదటిది ప్రపంచ ప్రారంభ నాగరికతలో ఒకటైన సింధు నాగరికత ఆనాడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నాగరికతలలో ఒకటి ఇలాంటి గొప్ప నాగరికత మన దేశానికి చెందినది కావడం మన దేశ ప్రజల గర్వకారణం ఈ నాగరికతను మెడిటరేనియన్‌ (‌ద్రవిడ) జాతికి చెందిన ప్రజలు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలతో సమానత్వంతో మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో గొప్ప అభివృద్ధిని ప్రదర్శిస్తూ తమ నాగరికతను నిర్మించుకున్నారు మనం మన పూర్వీకుల నుండి అందిపుచ్చుకున్న వారసత్వం ఇప్పుడు భారతదేశంలో కనుమరుగయ్యిందా లేక వారి వారసత్వాన్ని అంటరానితనంగా ఆమడ దూరంలో ఉంచామా అనే ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్న తరుణంలో మనం 75 సంవత్సరాల వజ్రోత్సవ సంబరాలను జరుపుకోవడం సూచనయమైన అంశం…

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తరువాత సమాజంలో సాంఘిక రుగ్మతలను రూపుమాపుకొని అభివృద్ధి వైపు ప్రయాణించడానికి నెహ్రూ ప్రభుత్వం 1929 -30 మధ్యకాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాన్యాన్ని ఎదురొడ్డి నిలిచి రష్యా ప్రభుత్వం అనుసరించిన పంచవర్ష ప్రణాళికలను అరువుకు తెచ్చుకోవడం మన మన దూర దృష్టికి ముందు చూపుగా పేర్కొనవచ్చు. ఇట్లా 1950 మార్చ్ 12‌న ప్రణాళిక సంఘాన్ని ఏర్పరచుకొని 1951 నుండి 2017 వరకు 12 పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకొని వాటిని అమలు పంచుకోవడం జరిగింది ఈ 12 పంచవర్ష ప్రణాళికలు అమలు విధానంలోనూ మరియు రాజకీయ నాయకులు స్వార్థ బుద్ధితోను ప్రణాళికలు ఆశించినంత అభివృద్ధిని సాధించ లేకపోవడం జరిగింది. అయినా కూడా భారత దేశంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఉద్యోగాలను కల్పించలేక నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలో డెమోగ్రఫీ డివిడెంట్‌ ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉన్నది ఇలా అత్యధికంగా డెమోగ్రఫీ డివిడెంట్‌ ఉన్నా కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేక నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వాలనే అంధకారంలోకి నెట్టు వేయబడుతున్నాయి .

విపరీతంగా పెరుగుతున్న నిరుద్యోగ సమస్య వల్ల పేదరికం పెరగడానికి పరోక్షంగా దోహదపడుతుంది భారత ప్రభుత్వాలు ఎన్నో నిరుద్యోగ నిర్మూలన పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఉదాహరణ ప్రధానమంత్రి ముద్ర యోజన రెండు ప్రధానమంత్రి రోజ్‌ ‌గారి ప్రస్థానం యోజన స్కిల్‌ ఇం‌డియన్‌ ‌మిషన్‌ ‌ప్రధానమంత్రి గంగా కళ్యాణ్‌ ‌యోజన మొదలైనటువంటి నిరుద్యోగ నిర్మూలన పథకాలు నిరుద్యోగులా జీవితాలలో వెలుగులు నింపలే కేవలం అవి పేపర్‌ ‌ప్రకటన లాగే మిగిలిపోయాయి ఇదే కాకుండా పేదరిక నిర్మూలన కోసంFWP,NREGP, భారత్‌ ‌Nirman, MGNREGP మొదలైన పథకాలు ఆశించిన స్థాయిలో భారత దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మించలేకపోయాయి అనడానికి 2004లో మరియు 2009లో ఏర్పడిన రమేష్‌ ‌టెండూల్కర్‌ ‌కమిటీ (37.2) మరియు రంగరాజన్‌ ‌కమిటీ (29.4) పేదలు ఉన్నారని అంచనా వేసింది ఈ ఘనంగాలే భారత దేశంలో ఉన్న పేదవారి శాతం తెలియజేస్తాయి ఇవేగాక ఇప్పటికీ భారత దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతుకుతున్న ఈ నాగరికత సమాజంలో ఆదివాసీలు అనాగరుకులుగానే మిగిలిపోతున్నారు.

ఇప్పటికీ అనేక వందల గ్రామాల ఆదివాసి గుడాలకు అవస్థాపన సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తున్నారు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరొక భయంకరమైనటువంటి సమస్య ఆర్థిక సమానతలు మూలంగా 80 శాతం సంపద కేవలం 20 శాతం మంది ప్రజలలోనే కేంద్రీకృతమైంది 20 శాతం సంపద 80 శాతం మంది చేతులలో ఉంది ఇలాంటి అసమానతలను రూపుమాపకుండా ఆదాని అంబానీలకు అనేక రకాలైన కాంట్రాక్టులు ఈ దేశ ప్రభుత్వాలు అసమానతలను పెంచి పోషించే విధంగానే ఉన్నాయి తప్ప రూపుమాపడానికి ఎలాంటి కృషి అనేది జరగటం లేదు పై పేర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఎంత ఘనంగా వజ్రోత్సవాలు జరిపిన సామాన్య ప్రజానికానికి ఒరిగేదేమీ లేదని పేర్కొంటూ 2047 సంవత్సరంలో జరగబోయే శతాబ్ద స్వాతంత్ర ఉత్సవాల సమయానికైనా సమస్యలన్నిటిని పరిష్కరించి భారతదేశం ఒక నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాము.
– రాగిపని. బ్రహ్మచారి
కాకతీయ యూనివర్సిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *