దేశంలో మోగిన ఎన్నికల నగారా
పార్లమెంట్‌తో పాటు నాలుగు రాష్టాల్ర ఎన్నికలు
అమల్లోకి ఎన్నికల కోడ్
మే 13న ఎపి, తెలంగాణ ఎన్నికలు
అదేరోజు కంటోన్మెంట్ ఉప ఎన్నిక
ఏప్రిల్ 19న తొలిదశ ఎన్నికల పోలింగ్
ఏప్రిల్ 26న రెండో దశ,మే 7న మూడో దశ
మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ
మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడోదశ
జూన్ 4న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
అదేరోజు ఫలితాల ప్రకటన
దేశంలో మొత్తం 97 కోట్ల మంది వోటర్లు
పురుష వోటర్లు 49.7 కోట్లు , మహిళా వోటర్లు 47.1 కోట్లు
న్యూదిల్లీ,ప్రజాతంత్ర,మార్చి
ఆంధప్రదేశ్ అసెంబ్లీకి కూడా లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలతోపాటు మే 13న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి లోక్‌సభ నాలుగు, ఐదు, ఆరు, ఏడు దశల ఎన్నికలతోపాటు నాలుగు దశల్లో మే 13న, మే 20న, మే 25, జూన్ 1న పోలింగ్ జరుగనుంది. ఇక కేవలం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విషయానికి వస్తే.. అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు,ఆంధ్రప్రదేశ్, చండీఘర్, డామన్ డయ్యూ,దిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్షద్వీప్, లడఖ్, మిజోరం, మేఘలాయ, నాగలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్‌లలో సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ నిర్వహించనున్నారు. అదేవిధంగా కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్లలో రెండు దశల్లో.. ఛత్తీస్‌గఢ్, అసోం రాష్టాల్ల్రో మూడు దశల్లో.. ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో ఐదు దశల్లో.. మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌లలో ఆరు దశల్లో, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ సహా వివిధ రాష్టాల్ల్రో మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక లు నిర్వహిస్తున్నట్లు సీఈసీ రాజీవ్‌కుమార్ చెప్పారు. తెలంగాణ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అసెంబ్లీ స్థానం ఖాలీ అయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 412 జనరల్ స్థానాలు కాగా, 84 ఎస్సీ రిజర్వ్డ్, 47 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయని ఆయన చెప్పారు.కాగా, ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ వోటు హక్కును వినియోగించుకోబోతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. అందులో కోటీ 82 లక్షల మంది కొత్త వోటర్లు ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడిరచారు.
ఎన్నికల విధుల్లో మొత్తం 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారని చెప్పారు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న 17వ లోక్‌సభ కాలపరిమితి వచ్చే జూన్ 16వ తేదీతో ముగియనుంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్టాల్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దాంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని సీఈసీ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం 7 దశలలో ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో 4వ దశలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించ నున్నారు. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ఈసీ స్పష్టం చేసింది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు ఛాన్స్ ఇచ్చారు. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్ 4వ తేదీన వోట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. దాదాపు 12 రాష్టాల్లో పురుషుల కన్నా మహిళా వోటర్ల సంఖ్యే అధికం. దాదాపు కోటిన్నర మంది అధికారులు ఎన్నికల పక్రియలో భాగం కానున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 55 లక్షల ఈవీఎమ్‌లు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటినుంచే వోటు అవకాశం కల్పించారు. దేశ వ్యాప్తంగా పురుష వోటర్లు 49.7 కోట్లు ఉండగా, మహిళా వోటర్లు 47.1 కోట్లు ఉన్నారు. 88.4 లక్షల మంది దివ్యాంగ వోటర్లు ఉండా, 1.85 కోట్ల మంది తొలిసారి వోటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి 1,000 మంది పురుషులకు 948 మంది మహిళా వోటర్లు ఉన్నారు. మొత్తం వోటర్లలో 48 వేల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.
ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చర్యలు
10.5 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
85 ఏళ్లు పైబడిన వోటర్లు ఇంటివద్దనే వోటేసే ఛాన్స్
న్యూదిల్లీ,ప్రజాతంత్ర,మార్చి
తెలంగాణలో ఒకే విడతలో పార్లమెంట్ ఎన్నికలు
మే 13న పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక
న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,మార్చి16: తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించ నుండగా తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ జరగనుందని సిఇసి రాజీవ్ కుమార్ వెల్లడిరచారు. నాలుగో విడుతలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 13న ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ వివరించింది.లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడత జరుగనుండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడుతలో జరుగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడుత పోలింగ్, 20న ఐదో విడత, 25న ఆరో విడత, జూన్ ఒకటిన ఏడో విడత పోలింగ్ జరుగుతుందని సీఈసీ తెలిపారు. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ వివరించింది.




