48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

  • ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు నిందితునిపై చేసి చట్ట పరంగా చర్యలు
  • బాధిత కుటుంబానికి న్యాయం
  • విలేఖరుల సమావేశంలో ఎస్పీ కోటి రెడ్డి వెల్లడి

పరిగి, మార్చి 30(ప్రజాతంత్ర) : వికారాబాద్‌ ‌జిల్లా పరిగి నియోజక వర్గం పూడూరు మండలం అంగడి చిట్టెం పల్లి గ్రామంలో మైనర్‌ ‌బాలికపై జరిగిన అత్యాచారం, ఆపై హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిగి పోలీస్‌ ‌స్టేషన్‌ ఆవరణలో బుధవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ కోటి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న మైనర్‌ ‌బాలికకు అదే గ్రామానికి చెందిన కావలి మహేందర్‌(‌నాని)తో గత 11నెలల కాలం నుండి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు, ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియడంతో అమ్మాయిని వారు మందలించగా, ఈ విషయాన్ని అమ్మాయి తిరిగి ప్రియుడితో చెప్పగా ఒక సారి కలుసుకోవాలని కోరగా అమ్మాయి సోమవారం రోజు తెల్లవారు జామున అతన్ని కలవడానికి వెళ్లినట్లు తెలిపారు.

ఈ క్రమంలో నిందితుడు బాలికను కామ వాంఛ తీర్చాలని కోరడంతో బాలిక ప్రతిఘటించడంతో నిందితుడు కోపంతో బాలిక తల పట్టుకుని నెట్టగా చెట్టుకు తగిలి తలకు గాయం కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఇవేమీ పట్టించుకోకుండా బాలికను వివస్త్రను చేసి కామ వాంఛ తీర్చుకున్నట్లు, ఈ నేపథ్యంలో బాలిక మరణించినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి సాంకేతిక పరమైన ఆధారాలు సేకరించినట్లు, నేరస్తునికి చట్ట పరంగా కఠిన శిక్ష పడేట్లు ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో డి ఎస్పీ శ్రీనివాస్‌, ‌సిఐ వెంకట్‌ ‌రామయ్య,చన్‌ ‌గొముల్‌ ఎస్‌ఐ ‌శ్రీశైలం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page