38‌వ రోజు భారత్‌ ‌జోడో యాత్ర…

ఉదయం కర్నాటకలో షురూ..మధ్యాహ్నం ఎపిలో..తిరిగి సాయంత్రం కర్నాటకలో
కొనసాగిన రాహుల్‌ ‌పాద యాత్ర
అనంతపూర్‌లో 12 కిలోమీటర్ల కొనసాగింపు
నేడు బళ్లారిలో భారీ బహిరంగ సభకు కర్నాటక రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు

బెంగళూరు/అనంతపురం, అక్టోబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కర్నాటకలో అత్యంత ప్రజాదరణతో కొనసాగుతున్నది. శుక్రవారం 38వ రోజు యాత్ర ఉదయం సెషన్‌ ‌రాంపూర్‌ ‌నుంచి మొదలయ్యింది. ఆయన వెంట భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర జాజిరికల్లు టోల్‌ ‌ప్లాజా మీదుగా ఎపి లోని అనంతపురం జిల్లా ఓబుళాపురంలో ప్రవేశించి అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకు విశ్రాంతి తీసుకుని ఎపిలో 12 కిలోమీటర్ల మే సాగి తిరిగి కర్నాటకలో కొనసాగింది. శుక్రవారం పాదయాత్రలో ఎపి పిసిసి చీఫ్‌ ‌శైలజానాథ్‌, ఇతర ఎపి నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నేడు శనివారం బళ్లారిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నది.

సభకు నాలుగు నుంచి లయిదు లక్షల జన సమీకరణ చేసి పార్టీ బలాన్ని ప్రదర్శించాలని వూహరచన చేస్తున్నారు. వొచ్చే సంవత్సరం మొదట్లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో ఈ యాత్ర రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీలో జోష్‌ ‌నింపింది. కాగా రాహుల్‌ ‌గాంధీ వాటర్‌ ‌ట్యాంక్‌ ‌పైకి ఎక్కి జాతీయ జెండా ఊపుతూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్‌ ‌మీడియాలో హల్‌చల్‌ ‌చేస్తున్నది. యాత్ర అక్టోబర్‌ 23‌న మక్తల్‌ ‌వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని అక్కడి నుంచి కొనసాగుతూ అక్టోబర్‌ 31 ‌నాటికి హైదరాబాద్‌లో చార్మినార్‌ ‌మీదుగా నెక్లెస్‌ ‌రోడ్‌ ‌చేరుకుని అక్కడ నిర్వహించే బహరంగ సభలో రాహుల్‌ ‌గాంధీ ప్రసంగిస్తారని తెలంగాణ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి గురువారం వెల్లడించారు. తెలంగాణలో యాత్ర జుక్కల్‌ ‌నియోజకవర్గం మద్నూర్‌ ‌వద్ద ముగుస్తుంది.

ఎపిలో రాహుల్‌ ‌జోడో యాత్ర… అనంతలో 12 కిలోమీటర్ల కొనసాగింపు…సాయంత్రం తిరిగి బళ్లారి నుంచి కర్నాటకలో కొనసాగింపు
రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర శుక్రవారం ఆంధప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్‌కు ఎపి పిసిసి చీఫ్‌ ‌శైలజానాథ్‌, ఇతర నేతలు రఘువీరారెడ్డి, తులసిరెడ్డి స్వాగతం పలికారు. జాజురకల్లు, మడేనహళ్లి, లక్ష్మీపురం, డి హీరేహాల్‌, ఓబులాపురం, ఓబులాపురం చెక్‌పోస్ట్ ‌మీదుగా పాదయాత్ర సాగింది. ఎపిలో శుక్రవారం 12 కిలోమీటర్ల వరకు రాహుల్‌ ‌గాంధీ పాదయాత్ర సాగింది. మరోవైపు రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జూడో యాత్ర సందర్భంగా పోలీస్‌ అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రా ప్రాంతంలో 12 కిలోవి•టర్లను పూర్తిగా పోలీసు కనుసన్నల్లో ఉండేలా ఆంధ్రా-కర్ణాటక పోలీస్‌ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. బళ్లారి-బెంగళూరు హైవేలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *