న్యూదిల్లీ,జనవరి3 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్6న ముగియనున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో మాదిఇగానే ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అంతకు ముందు రోజు అంటే జనవరి 31న ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో తొలిరోజు ఉభయ సభలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి.
ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి ఇవి తొలి సమావేశాలు కావడం విశేషం. తొలి విడతలో సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6న ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగియనున్నట్లు తెలుస్తున్నది. బడ్జెట్ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్రబడ్జెట్‌పై జరిగే చర్చలకు ఆర్థిక మంత్రి సమాధానం సమాధానం ఇవ్వనున్నారు. రెండో విడుత సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇకపోతే ఇప్పటికే వివిధ శాకలు బడ్జెట్ కసరత్తును మొదలు పెట్టాయి. చేనేతను ఆదుకోవాలని, బడ్జెట్ కేటాయింపులు చేయాలని మంత్రికెటిఆర్ ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. చేనేతపై జిఎస్టీ ఎత్తేయాలన్నారు.