నెత్తురోడిన దండకారణ్యం

ఛత్తీస్‌గ‌ఢ్ లో పోలీసులకు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు
30 మంది మావోయిస్టుల మృతి
మృతుల సంఖ్య మ‌రింత‌ పెరిగే అవకాశం
భారీగా ఆయుధాలు స్వాధీనం

ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో మరోసారి కాల్పులు మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్‌రాయ్‌  ధ్రువీకరించారు. దంతెవాడ పోలీసులు, కేంద్రబలగాలు శుక్ర‌వారం జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..  ఛత్తీస్ గ‌ఢ్‌  రాష్ట్రంలోని దంతెవాడ, నారాయణపూర్‌ జిల్లా  బొంత లంక, జూరాపల్లి అబూజ్‌మడ్‌లో శుక్రవారం మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్క సమాచారం తెలుసుకున్న భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సమయంలో భ‌ద్ర‌తాద‌ళాల‌కు  మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా అందుకు ప్రతిఘటించిన భద్రత బలగాలు ఎదురుకాల్పులకు దిగారని .. ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్‌ అధికారులు  వెల్ల‌డించారు. అబూజ్‌ మడ్‌ లో మావోయిస్టులు  సుప్మా జిల్లా పరిధిలో బొంతలంక జూరాపల్లి అడవి ప్రాంతంలో   ప్రత్యేకంగా సమావేశమయ్యారని భద్రత బలగాలు తెలుసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పులు 30 మంది మావోయిస్టులు మృత్యువాతపడ్డారు.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
అదే ప్రాంతంలో భద్రత బలగాలు అటవీ ప్రాంతంలో గాయపడిన మావోయిస్టుల కోసం యత్నించగా ఆ ప్రాంతంలో రక్తపు మరకలు ఉన్నట్లు గమనించారు. మరి కొంతమంది మావోయిస్టులు గాయపడి ఉంటారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన మావోయిస్టులను వారి సహచ‌ర మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు. మావోయిస్టులు సమావేశమైన ప్రాంతంలో భారీగా ఆయుధాలు లభ్యమైనట్లు బస్తర్‌ ఐజి పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది.  ఇటీవల కాలంలో మావోయిస్టులు భారీగా పోలీస్‌ కాల్పులకు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు సుమారు 170 మంది మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది.
కాగా మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ప్రత్యేక బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు కూడా సమాచారం. ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో కేంద్ర ప్రత్యేక బలగాలు అటవీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సాధించడంతో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.  ఛత్తీస్‌గ‌ఢ్‌ అడవి ప్రాంతం సేఫ్‌ జోన్‌ గా భావించిన మావోయిస్టులు అక్కడ ఎంతోకాలంగా త‌ల‌దాచుకుంటున్నారు. ఇటీవలే మావోయిస్టు పార్టీని నియంత్రించేందుకు భారీగా బలగాలు మోహరించడంతో మావోయిస్టుల పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారింది. భద్రత బలగాలు చేతులు నష్టపోతున్న మావోయిస్టు పార్టీ అందుకు మరింత బలపడేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. జనవరి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page