- లాటరీ ద్వారా దవాఖానాల వివరాల ప్రకటన
- ఎస్సీలు ఆర్థికంగా అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి
- వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
ప్రజాతంత్ర , హైదరాబాద్ : విద్యావంతులైన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమై ప్రణాళికలు తయారు చేసుకోవలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. అందుకు అవసరమైన సహాయ,సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మంగళవారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రబుత్వ దవాఖానాలలో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎస్సీలకు కేటాయించిన దవాఖానాల వివరాలను లాటరీ తీసి ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్టాదుతూ ఈ ఒక్క లాటరీ స్లిప్పు ఒక్కో జీవితాన్ని మార్చివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాస్ట్రంలో 100 పడకలలోపు దవాఖానాలు 122 ఉండగా, వాటిలో 20, 150 పడకల లోపు దవాఖానాలు 53 ఉండగా వాటిలో 8 ఎస్సీలకు కేటాయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బందు కేవలం కార్యక్రమం కాదనీ, ఇది ఒక ఉద్యమమని పేర్కొన్నారు. దళిత బంధు లబ్దిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా ఆ యూనిట్‌ను గ్రౌండ్ చేసేలా ఉన్నతాధికారలు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్దిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నారని చెప్పారు. నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేస్తన్నారనీ, ఇప్పటికే వైన్ షాపులలో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయనీ, 300కు పైగా షాపుల్లో దళితులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాలలో శానిటేషన్, సెక్యూటిరీ, డైట్ ఏజెన్సీలలో 16 శాతం దళితులకు కేటాయిస్తున్నామనీ, 100 పడకల లోపు హాస్పిటల్‌ను ఒక కేటగిరీగా, అంతకు పైగా ఉన్న హాస్పిటల్స్‌ను మరో కేటగిరీగా విభజించామని చెప్పారు. ఏయే హాస్పిటళ్లను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయించామనీ, మొత్తం 56 హాస్పిటల్స్‌ను దళితకులకు కేటాయించడం జరిగిందనీ, వీటికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలుస్తారని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు.