15 ‌నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జి 20 సమావేశాలు

సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల రాక
కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన వి•డియాతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌ ‌వేదికగా జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారని అన్నారు. హైటెక్స్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణం మార్పు తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారు.

ఆహారం కోసం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై కూడా చర్చిస్తారు. టూరిజం చివరి సమావేశాలు జూన్‌ 19, 20, 21, 22 ‌తేదీల్లో గోవాలో జరుగుతాయి. గోవా రోడ్‌ ‌మ్యాప్‌ ‌పేరుతో డ్రాప్ట్‌ను జీ20 మంత్రుల సమావేశంలో తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సాంస్కృతిక శాఖ ఫైనల్‌ ‌వి•టింగ్‌లు వారణాసిలో జరుగుతాయి. ప్రగతి మైదాన్‌లో సెప్టెంబర్‌ 9, 10‌వ తేదీల్లో 18వ జీ20 చివరి సమావేశాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *