15‌న బళ్లారిలో రాహుల్‌ ‌భారీ బహిరంగ సభ

ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌ ‌నేతలు

రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో ఐక్యతా పాదయాత్ర ఈ నెల 15న బళ్లారికి చేరనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లను కేపీసీసీ ఎం.బీ.పాటిల్‌, ‌మాజీ మంత్రి సంతోష్‌ ‌లాడ్‌, ‌రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ ‌హుశేన్‌ ‌తదితరులు గురువారం సాయంత్రం పరిశీలించారు. అంతకుముందు నగరంలో ఓ ప్రైవేట్‌ ‌హోటల్లో పార్టీ నాయకులు కంప్లి గణెళిశ్‌, ‌మాజీ మంత్రులు అల్లం వీరభద్రప్ప, దివాకర్‌బాబు, మేయర్‌ ‌రాజేశ్వరీ, విధాన పరిషత్‌ ‌సభ్యుడు కేఎస్‌ఎల్‌ ‌స్వామి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి జేఎస్‌ ఆం‌జనేయులు, జిల్లాధ్యక్షుడు పాటిల్‌తో సమావేశమయ్యారు.

జీఎస్‌. ‌మహమ్మద్‌ ‌రఫిక్‌, ‌నాయకులు వెంకటరావు ఘోర్పడే, బీవీ శివయోగి, అబ్దుల్‌ ‌వహాబ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. సమావేశవేదిక ఏర్పాటు, ఆహారం, పార్కింగ్‌ ‌మొదలైన వాటిపై చర్చించారు. రాష్ట్ర నలమూలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *