- రేపు బడ్జెట్ సమర్పణ..12 ద్రవ్య వినిమయ ఇల్లు
- ప్రభుత్వం నిర్ణయం…25 రోజులు నడుపాలని కాంగ్రెస్ డిమాండ్
- రెండోరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ
- కరెంట్ ఎప్పుడు వొస్త్తదో..ఎప్పుడు పోతదో : మండలిలో కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి విమర్శలు
- అవసరం లేని విషయాలు మాట్లాడొద్దు : అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు కెటిఆర్ కౌంటర్
- శాసనసభ రేపటికి వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలకు అసంతృప్తిని మిగిల్చింది. 25 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను సర్కార్ పక్కన పెట్టింది. ఈ నెల 12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 7న అసెంబ్లీకి సెలవు. తిరిగి 8న బడ్జెట్‌పై సభలో సాధారణ చర్చ జరుగనుంది. 9, 10, 11 మూడు రోజుల పాటు పద్దులపై చర్చ జరుగనుంది. 12న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. తరవాత అసెంబ్లీ వాయిదా పడనుంది.
అసెంబ్లీ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. సమస్యలు అనేకం ఉన్నందున వాటిని చర్చించేందుకు సమావేశాలను ఎక్కువ రోజులు జరపాలని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క కోరారు. బిఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే ఎంఐఎం సైతం సభను 20 రోజుల పాటు కొనసాగించాలని పట్టుబడింది. సమావేశాల కొనసాగింపు 8న నిర్ణయిం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంపై ప్రతిక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే కేవలం ఆరు రోజుల పాటు సభను నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
రెండోరోజుకొనసాగిన అసెంబ్లీ…గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజైన శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ చేపట్టారు. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలో రెండో తీర్మానాన్ని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, శాసనసభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రవేశపెట్టారు. ధన్యవాద తీర్మానాలను ఉభయ సభల్లో చర్చించారు. అసెంబ్లీలో వీటికి కెటిఆర్ సమాధానం చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ మంచి ఫలితాలిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి సహకారం లభించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర బ్జడెట్‌లో ఊసేలేదని విమర్శించారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కరెంట్ ఎప్పుడు వొస్త్తదో..ఎప్పుడు పోతదో : మండలిలో కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి విమర్శలు శాసనమండలి సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ అడ్డుపడ్డారు. దీంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వి•రు మంత్రి కాదు అలాంటప్పుడు జీవన్ రెడ్డి మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన జీవన్ రెడ్డి వాస్తవాలకు భిన్నంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కరెంట్ ఎప్పుడు వొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. దీనిపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడానని జీవన్ రెడ్డి అనగా..సభలో లేని వ్యక్తుల పేర్లు తీయొద్దని చైర్మన్ సూచించారు. ఆ పదాలను శాసనమండలి రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కరెంట్ ఇబ్బందులు ఉన్నాయో ఆ వివరాలను మంత్రికి తెలియజేస్తే ఆయన సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. రైతులకు ఎంత కరెంట్ కావాలో అంత ఇస్తున్నారని చైర్మన్ స్పష్టం చేశారు.
అవసరం లేని విషయాలు మాట్లాడొద్దు : అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు కెటిఆర్ కౌంటర్
అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార పక్షానికి దాని అనుకూల పార్టీకి మధ్య కౌంటర్ల వార్ జరగడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. నేటి అసెంబ్లీలో అదే జరిగింది. మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడిచింది. సభా నాయకుడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై అక్బరుద్దీన్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఇలాంటి సభను తన 25 ఏళ్లలో ఏనాడూ చూడలేదు. బీఆర్‌ఎస్ నేతలకు టీవీ డిబేట్‌లకు వెళ్లే టైం ఉంటుంది కానీ సభకు వొచ్చే టైం లేదా? అని ఎద్దేవా చేశారు. సభా నాయకుడితో సంబంధమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. హావి•లు ఇస్తారు..అమలు చేయరు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవరు.
విరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాం. పాతబస్తీలో మెట్రోరైలు సంగతి ఏమిటి? ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితేంటి ? ఉర్దూ రెండో భాష అయినా అన్యాయమే. బీఏసీలో ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో కనిపించడం లేదు. అన్న దానికి కెటిఆర్ సమాధానమిస్తూ…మంత్రులు అందుబాటులో లేరన్నది అవాస్తవం. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీ ఎక్కువ టైమ్ అడగడం సరికాదు. సభ్యులను బట్టి పార్టీలకు సమయం కేటాయిస్తాం. బీఏసీకి రాకుండా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆవేశంగా మాట్లాడటం కాదు..అర్థవంతంగా సమాధానం ఇవ్వాలి. సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. నేను కొత్త సభ్యున్ని కాదు.. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యా. టైంను ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు.. రాజ్యంగబద్దంగా చర్చ జరగాలి. గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం. ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ఓవైసీ అన్నారు.
శాసనసభ రేపటికి వాయిదా
శాసనసభ సమావేశాలు రేపు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో రోజైన నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం టేబుల్ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభకు సమర్పించారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు సంబంధించిన 1వ, 2వ, 3వ వార్షిక నివేదికలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభకు అందజేశారు. ధన్యవాద ప్రసంగంపై చర్చ, సమాధానం అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.