హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 03 : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేస్తుందని పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పికె.నరేష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జుమ్ని గోపాల్ తెలిపారు. అభ్యర్థుల లిస్టు శని, ఆదివారాల్లో ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎన్ఎన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పదేళ్ళపాటు కాలం గడిపారని ఆరోపించారు. రెండు సార్లు తెలంగాణ ప్రజలు కెసి ఆర్ కు అవకాశం ఇచ్చిన వట్టించుకోలేదని, ప్రస్తుతం కొత్త, కొత్త హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కెసిఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, కెసిఆర్ పై తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఈ సారి ఓటమి తథ్యమని వారు స్పష్టం చేశారు.
119 స్థానాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పోటి
