కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపింది
దుమ్ముగూడెంలో అరెస్ట్‌ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి
లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌

భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి,29 : ఇప్పుడు జరిగినవన్నీ పోలీసుల హత్యలేనని దీనికి పోలీసులే భాద్యత వహించాలని మావోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్‌ శుక్రవారం లేఖ విడుదల చేసారు. గడ్చిరోలిలో జరిగిన పోలీసుల హత్యలకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులే బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.దుమ్ముగూడెంలో అరెస్టు చేసి మాయం చేసిన చత్తీస్‌ గడ్‌ ఆదివాసీ యువకులను ఏం చేశారో ప్రభుత్వ జవాబు చెప్పాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ డిమాండ్‌ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ, బీజేపితో చేతులు కలిపి విప్లవ ప్రతిఘాతుక కగార్‌(అంతిమ దశ) ఆపరేషన్స్‌ కొనసాగిస్తున్నాయని లేఖలో తెలిపారు. ప్రజలపై, ప్రజాస్వామిక వాదులపై దాడులు చేయడానికి పూనుకున్నాయని అన్నారు.

మావోయిస్టు పార్టీ నిర్మూలనకు నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించాయని, అందులో భాగంగానే మార్చి 19 తేదీన మహారాష్ట్ర, గడిచిరోలి జిల్లా, అహిరి తాలూకాలో కొల్లమర్క అడవి ప్రాంతంలో రేపన్‌ పల్లి గ్రామం వద్ద ఎన్కౌంటర్‌ పేరుతో మావోయిస్టులు కా. మంగు , కా.రాజు , కా.బుద్రాం లను హత్య చేశారని, శుక్రవారం విడుదల చేసిన ఒక లేఖలో ఆరోపించారు.. ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామన్న కాంగేస్‌ పార్టీ, అధికారాన్ని చేపట్టిన అనంతరం ఇప్పుడు విప్లవకారులను హత్యలు చేస్తుందని, వాస్తవానికి గడ్చిరోలిలో జరిగిన ఆ బూటకపు ఎన్‌కౌంటర్‌ ఘటన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ పోలీసు ద్వారా జరిపించిందని అన్నారు . తిండి పదార్థాల్లో విషం ఇచ్చి వాళ్ళను స్పృహా కోల్పోయాలా చేసి, పట్టుకుని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి కరంగా హత్య చేశారని అన్నారని విడుదలచేసిన లేఖలో పేర్కొన్నారు . ఈ పధకం మంచిర్యాల జిల్లా ఎస్పీ ద్వారా అమలు చేశారని, ఈ ఎన్‌ కౌంటర్‌నెత్తుటి మరకలు తెలంగాణ ప్రభుత్వం చేతులకు అంటకుండా మహారాష్ట్ర పోలీసుల ఎన్‌ కౌంటర్లో మరణించినట్లుగా నాటకీయంగా చిత్రికరించారని ఆరోపించారు.

సీ-60పోలీసులకు, మావోయిస్టులకు మద్య జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో మృతి చెందారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు నిర్మూలన కోసం నిర్ణయాత్మక యుద్ధాన్ని మరింత పకడ్భందిగా కొనసాగించడానికి తెలంగాణ, మహారాష్ట్రాల మంచిర్యాల, భూపాలపల్లి. గడిచిరోలి జిల్లాల పోలీసు ఎస్పీలతో సంయుక్త సమావేశం జరిపారని అన్నారు . దీనితో ప్రజాస్వామ్యం అనే ముసుగు తొడుక్కున్న కాంగ్రేస్‌ పార్టీ దమన నీతి ఏంటో అర్ధమవుతుందని లేఖ లో పేర్కొన్నారు . మార్చి 8వ తేదీన చత్తీష్‌ గడ్‌ రాష్ట్రం, బీజాపూర్‌ జిల్లా, ఊసూర్‌ బ్లాక్‌, తుమ్మిరెల్లి గ్రామానికి చెందిన మాదేవ్‌, మాడ్కాల్‌ అనే ఇద్దరు అమాయక ఆదివాసి యువకులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి మాయం చేశారని, 25 రోజులుగా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసుస్టేషన్‌ ల చుట్టూ తిరిగుతున్నా వారు ఎక్కడ వున్నరో ఇప్పటికీ చెప్పకుండా..

మేము అరెస్టు చేయలేదని బుకాయిస్తున్నారని అన్నారని లేఖలో పేర్కొన్నారు. చత్తీష్‌గడ్‌ నుంచి  మిర్చి కోతలకు వెళ్తున్న ఆదివాసీలను మావోయిస్టుల నేపంతో వేధిస్తున్నారని, వారి మకాంల వద్దకు వెళ్ళి అరెస్టులు చేసి తీసుకెళ్ళి  తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు. బాధితుల ద్వారానే పోలీసులు ఎలాంటి చిత్రహింసలకు గురి చేయలేదనే పత్రాలు రాయించుకుని పంపిస్తున్నారని ఆరోపించారు . ఇటీవలే చర్ల పోలీసులు చత్తీష్‌గడ్‌ రాష్ట్రం. బీజాపూర్‌ జిల్లా నేండ్ర గ్రామస్తులను ఐదుగురిని పట్టుకుని అందులో ముగ్గురి యువకులను చిత్రహింసలకు గురి చేసి పోలీసులుమమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదనే పత్రాన్ని రాయించుకుని పంపారని సంచలన వ్యాఖ్యలు లేఖ ద్వారా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *