- రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు
- కాంగ్రెస్ నిర్లక్షయానికి నిదర్శనమన్న కెటిఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
ఫార్ములా రేస్ రద్దు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఫార్ములా రేసింగ్ రద్దుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం, భారత్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయని సూచించారు. చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్‌పై తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదు.
భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించాము. ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బజ్‌వర్డ్‌గా మారిన ప్రపంచంలో హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడానికి ఎంతో కష్టపడ్డామన్నారు. ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌ను ఉపయోగించుకుందని వెల్లడించారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్ కోసం తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేసింగ్ రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు చాలా నష్టం కలిగిస్తాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఫార్ములా రేస్‌తో ప్రజలకు ఉపయోగం లేదు
రద్దు చేయడం వల్ల వచ్చే నష్టం లేదన్న నిరంజన్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి





