హైకోర్టు కొత్త భవనం కోసం వందెకరాలు

జివో జారీచేసిన రేంవత్‌ ప్రభుత్వం
హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: తెలంగాణ కొత్త హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమి కేటాయింపు జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌, ప్రేమావతిపేటలోని స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చింది.

గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నూతన హైకోర్టు నిర్మాణానికి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *