హెల్త్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ

  •  శంషాబాద్‌ సమీపంలో  సకల వసతులతో మెడికల్‌ హబ్‌
  •  హాస్పిటల్‌ 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి
  • బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ సేవలకు ప్రశంసలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : రాష్ట్రాన్ని మెడికల్‌ టూరిజం హబ్‌గా ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇక్కడ అత్యంత అధునాతన హాస్పిటళ్లు ఉన్నాయని, వాటిని కనెక్ట్‌ చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం మెడికల్‌ టూరిజం ప్రతిపాదన ఉందన్నారు. సీఎం హోదాలో తాను నిత్యం 18 గంటలు పనిచేస్తున్నానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్టీఆర్‌ ఆలోచనను కుటుంబ సభ్యులు కార్యరూపంలో పెట్టారని చెప్పారు. క్యాన్సర్‌ను అరికట్టాలనేది గొప్ప ఆలోచన అని అన్నారు. భవిష్యత్‌లోనూ బసవతారకం హాస్పిటల్‌కు తోడుంటామని, విస్తరణకు సహకరిస్తామని చెప్పారు. నిత్యం ఎంతో మందికి హాస్పిటల్‌ సేవలందిస్తుందని తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు పక్కన భూమి తీసుకుని మెడికల్‌ హబ్‌గా పెద్ద హాస్పిటల్‌ కట్టిస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు వొస్తే జబ్బు నయమౌతుందనేలా చేస్తామని అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు పోటి పడుతాయని తెలిపారు.

24వ వార్షికోత్సవానికి బాలకృష్ణ ఆహ్వానించారని 30వ వార్షికోత్సవానికి కూడా తానే వొస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. బసవతారకం హాస్పిటల్‌ లక్షలాది మందికి సేవలందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు హాస్పిటల్‌ని నిర్మించారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వొచ్చిందని, ఆయన 18 గంటలు పనిచేసి..తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని, తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని అన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలని, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సిఎం రేవంత్‌ అన్నారు. హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నామని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు హెల్త్‌ టూరిజం హబ్‌ ఉంటుందన్నారు. అందులో బసవతారకం హాస్పిటల్‌కి తప్పకుండా స్థానం ఉంటుందన్నారు. వెయ్యి ఎకరాల్లో హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచంలోని ఎవరైనా హైదరాబాద్‌కు వొస్తే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

ఎన్టీఆర్‌ ఆలోచనలో ఏర్పాటైన ఈ హాస్పిటల్‌ 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవ చేయడం ఆనందదాయకమని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిం చేందుకు చంద్రబాబు నాయుడు హాస్పిటల్‌ని పూర్తి చేసిపేదలకు సేవలు   అందించడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించాలన్న ఎన్టీఆర్‌ ఆశయాలను అమలు చేయడం చూసి స్వర్గం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారనన్నారు.    నిరుపేదలకు క్యాన్సర్‌ వ్యాధిని నయం చేసేందుకు వైద్యరంగంలో విశేష కృషి చేసిన ఎన్టీఆర్‌ బసవతారం హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి చేస్తానని హావ్ని ఇచ్చారు. హాస్పిటల్‌కి సంబంధించి ఎలాంటి సహకారం అందించాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హాస్పిటల్‌ ఛైర్మన్‌ బాలకృష్ణ హావ్ని ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీపడే అవకాశం వొచ్చిందన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలన్నారు. డొనేషన్‌తో నడిచే ఈ హాస్పిటల్‌లో పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందని, అందుకే అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్యాన్సర్‌ రోగులు వొచ్చి చికిత్స పొందుతున్నారని, క్యాన్సర్‌ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని బసవతారకం హాస్పిటల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. హాస్పిటల్‌ సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి సహకారం కోరగానే అంగీకరించారని చెప్పారు. దాతల సహకారంతో హాస్పిటల్‌ ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. సేవలను మరింత విస్తరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, డా.నోరి దత్తాత్రేయుడు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *