సీతారాముల ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : భదాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భదాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *