సీఎం కేసీఆర్ అవినీతి బయపడుతుందనే భయంతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.సంజయ్ చేపట్టిన పాదయాత్ర స్టేషణ్‌ఘన్‌పూర్ మండలంలోని పామునూర్ నుండి పాదయాత్ర కొనసాగింది.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కూనూర్ గ్రామంలో బండి సంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో ఆగ్రహించిన బిజెపి నాయకులు సీఎం కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.దీంతో పరిస్దితి ఉద్రిక్తంగా మారింది.సంఘటన స్దలానికి పోలీసులు చేరుకుని లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
పోలీసుల తీరుపై బిజెపి కార్యకర్తలు రోడ్డుపై బైటాయించి పోలీసులకు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.ఈసందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ వరంగల్ లోని ఆర్ట్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింసు సభను నిర్వహించే తీరుతామన్నారు.కేసీఆర్ ఎన్ని రాజకీయాలు చేసినా కోర్టు తమకు సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తుందని దీమా వ్యక్తం చేశారు.బిజెపి జిల్లాధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి మాట్లాడుతూ బిజెపి సభకు పర్మిషన్ ఇచ్చిన ఆర్ట్ కాలేజీ యాజమాన్యం తిరిగి తమ డబ్బులను తమకు చెల్లిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.అధికార పార్టీకి భయపడి తమకు పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు.పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




