ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి
సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచ లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను సోమవారం మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు..పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..సిద్దిపేటలో బీఫార్మసీ కాలేజ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది..8 నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయం..అన్నారు.విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట. అన్ని రకాల చదువులతో ఈరోజు సిద్దిపేట జిల్లా విరాజిల్లుతోంది అని పేర్కొంటూ..మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇలా అన్ని రకాల విద్యలు సిద్దిపేటలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాదులో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇప్పటినుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించాం..అని తెలిపారు. మహిళా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. ఎంతో మందికి విద్యను ఉపాధిని ఎగ్జిబిషన్స్ సొసైటీ కల్పిస్తుందని తెలిపారు.




