కెసిఆర్‌కు ఈసీ నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : సిఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చింది. గురువారం 18వ తేదీ ఉదయం 11 గంటలలోగా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంది.
ఈ మేరకు బుధవారం ఈసీ నోటీసులు ఇచ్చింది. సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. గతసారి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కేసీఆర్, కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలతో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వెళుతుండడంతో ఈసీ సీరియస్‌గా ఉంది.




