సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల కుంభకోణం

  • హరీష్‌రావు మాజీ పిఎ అరెస్ట్‌
  • తమకు సంబంధం లేదని హరీష్‌ కార్యాలయం వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌లో గోల్‌మాల్‌ జరిగిందని కేసు రిజిస్టర్‌ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నలుగుర్ని అరెస్టు చేశారు. వారిలో హరీష్‌ రావు పీఏ నరేష్‌ ఉన్నాడు. జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు కార్యాలయం స్పందించింది. ’హరీష్‌ రావు పీఏ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు కాజేసిండనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడిరచింది. వాస్తవం ఏమిటంటే నరేష్‌ అనే వ్యక్తి హరీష్‌ రావు వద్ద పీఏ కాదు.

అతను ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీష్‌ రావు కార్యాలయంలో పని చేసే వారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, డిసెంబర్‌ 5న ప్రభుత్వ ఆదేశాలు  ప్రకారం, ఆ ఆఫీస్‌ను తర్వాత రోజు రోజున మూసివేసి, సిబ్బందిని పంపే శాం. ఆ రోజు నుంచి నరేష్‌ అనే వ్యక్తితో హరీష్‌ రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను తన వెంట తీసుకువెళ్లినట్లు తమ దృష్టికొ వొచ్చిందన్నారు.

దీనిపై వెంటనే తమ కార్యాలయం స్పందించి, నరేష్‌ అనే వ్యక్తిపై ఆనాడే నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, చట్ట ప్రకారం, తగు చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. కాబట్టి, ఆ వ్యక్తితో హరీష్‌ రావుకి గానీ, కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఒక వ్యక్తి చేసిన తప్పును, మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరమని, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు తమ కార్యాలయం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు కాకుండా, ఎన్నో విధాలుగా సహాయంపడిరదని, ఈ విషయం అందరికి తెలిసిందేనని, వాస్తవాలు గుర్తించాలని కోరుతున్నామంటూ ప్రకటన రిలీజ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *