తొలకరి పలకరింపు తో సకల రైతాంగం సాగుకు సన్నద్దమవుతోంది ,ఇప్పటికి వర్షాకాల సమయం ఆలస్య మైనప్పటికీ రుతు పవనాల సవ్వడి వడి వాడిగానే పరుగులెడుతోంది ,ప్రతి ఏటా రైతాంగము సాధరణ దొరణలోనే తమ వ్యవసాయ కార్యక్రమాలకు సన్న హాలు చేస్తోంది అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకనే యాసంగి పంటల్లో చాల నష్టపోయారు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వ్యవసా యానికి దూరమయిన రైతాంగానికి సాగునీరు అందించడం ఒక్కటే, సమస్య పరిష్కారానికి మార్గం కాదు చారు. రైతులకు ఆత్మస్థయిర్యం కల్పించి ధ్కెర్యంగా వ్యవసాయం చేసేందుకు దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టాలి లాభసాటి వ్యవసాయనికి అనుకూలమైన అధ్యయనాలు ల సాగాలి వాతవరణ పరిస్థితులు అనుకూలించక వ్యవసాయం సాకారమణగా సాగక రైతులు అప్పుల పాలవుతున్నారు ,సాగు కూలి ఖర్చులు పెరిగిపోయాయి వ్యవసా యోత్పత్తులకు లాభసాటి ధర లభించక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు రాష్ట్రములో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్న పరిస్థితు లలో వానలు రాక ఆలస్యమవడం అవడముతో , సాగు నీరు అందక పైర్లు ఎండిన పరిస్థితి రాకూడదడఉటే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటినుండే మేల్కొనాలి ,రైతు ల వలసలు ఆపాలి ,దేశం లో 58 శాతాము ప్రజలకు జీవన భృతి కల్పించేది వ్యవసాయమే అధిక శాతము రైతులు అప్పులు అసలు వడ్డీలు కట్టలేక క్రుంగి పోతున్నారు ,రైతు బందు తో ఎంతో కొంత అసరైనప్పటికీ పంట భీమా పంట పెట్టుబడి కిట్టు బాటు ధరకు గ్యారంటీ లేక రైతు కొట్టుమిట్టాడుతున్నడుసాగు నీటి కోరతః ఎరువుల పురుగు మందు ధరలు పెరుగుతుండడముతో ఖర్చులు పెరుగుతున్నాయి దీనికి తగ్గట్టుగా ఉత్పత్తులకు గిట్టుబాట దర కల్పించటం లేదు ఈ సమస్య చాలదన్నటు దళారీ వ్యవస్త దోచుకుంటోందిసాగు నీటి కోరతః ఎరువుల పురుగు మందు ధరలు పెరుగుతుం డడముతో ఖర్చులు పెరుగుతున్నాయి దీనికి తగ్గట్టుగా ఉత్పత్తులకు గిట్టుబాట దర కల్పించ టం లేదు ఈ సమస్య చాలదన్నటు దళారీ వ్యవస్త దోచుకుంటోంది సరైన విత్తనాలు దొరక్క విత్తిన పైరు సరైనరీతిలో పెరుగక దిగుబడులు తగ్గిపోతున్నాయి.
ఎప్పుడో ఒక సారి సంతృప్తికరమైన దిగుబడులు వచ్చిన చాలాస ందరాబుల్లో కన్నీళ్లే మిగులుతు న్నాయిపంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైన వ్యాపారరంగంగా మార్చాలి . పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై ఎగుమతులపైనా ద్రుష్టి పెట్టాలి పంటల వైవిధ్యీకరణలో భాగంగా అంతర పంటల ద్వారా రైతులు సాగు చేస్తూ అధిక దిగుబడులు ఆశించవచ్చు . వ్యవసాయంలో యాంత్రీకరణ, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు, పెద్ద కమతాలు లాంటివి ప్రోత్సహించాలి, రైతులు ఒకే రకమైన పంటల తో సరిపెట్టుకోకుండా వివిడ రకాలైన పాణతాలని త పండించు కోవాలి ఒక పంటలో కాకా పోయిన మరో పనటలోనైనా దిగుబడులు వచ్చే ఆస్కారముంది వీటితో పటు పశు పోషణ కోళ్ల పెంపకం లాంటి ఉత్పత్తులు చేపట్టాలి ఖర్చులు తగ్గించుకొనే మార్గాలు వెతకాలి ప్రబుత్య యంత్రాంగాలు వ్యవస్య రాబడులు పెరిగే ఆలోచన చేసి రైతులను ఆదుకోక పొతే దేశం లో సగానికి మించి రైతాంగం జీవనం దుర్భర మవుతోంది ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత రైతే అని సగర్వంగా ప్రకటించి అందుకనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలి , తెలంగాణ సాగుబడి 2020-21 నాటికే 1 కోటీ 6 లక్షల ఎకరాలకు విస్తరించింది.
దీనికి తోడూ సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక వ్యవసాయ విధానాలు, ఉచిత విద్యుత్ ప్రవాహాలు, రైతు బంధు, రైతు చెంతకే వెళ్ళి, వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాల ద్వారా పంట సేకరణ వంటి పథకాలతో తేలంగాణా ప్రభుత్వం రైతు పక్ష పత్తి అని ప్రకటించుకుంది ,అయితే ప్రసంగాలకు ప్రకటనలకు పరిమితం కాకుండా సమస్య లోతుల్లోకెళ్లి ప్రతి గ్రామాన్ని మరో అంకాపూర్ చేసే దాక యంత్రాంగాన్నీ నిద్రపోనివ్వకూడదు వ్యవసాయం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు, భూగర్భజలాలు నీటి యాజమాన్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. సేద్యానికి ఆరోగ్యకరమైన, పోషకాలున్న నేల అవసరం. అనేక జీవ క్రియలు జరిగేందుకు అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన నేల ఉపరితలం భూసారాన్ని కాపాడి పోషక విలువలున్న పంటలను అందిస్తుంది. అశాస్త్రీయమైన వ్యయసాయ పద్దతులు, నేలను పదేపదే ఉపయోగించడం, నీటివృథా, అడవుల నరికివేత, రసాయన ఎరువుల అతి వాడకం లాంటివన్నీ భూసారం తగ్గడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నా రు
ఎరువుల వినియోగం:ఎరువుల వినియోగంలో రైతులకు సరైన అవగాహన లేనందువల్ల అటు ఆర్థికంగా, ఇటు దిగుబడుల పరంగా నష్టపోతున్నారు. నీటి యాజమాన్యంతో పాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంలోనూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలి. వరిసాగులో రసాయన ఎరువులపై రైతులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. భూసార పరీక్షలు చేయించనప్పుడు ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 నుంచి 16 కిలోల పొటాష్ లభించే ఎరువులను మాత్రమే వాడాలి. అంతకు మించి వాడితే పొలంపై తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉంది.
రైతులకు నాణ్యమైన విత్తన సరఫరా చేయాలి
రైతులకు నాణ్యమైన విత్తన లభ్యతను దృష్టిలో పెట్టుకుని ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలనే సేకరించాలి తదనుగుణంగా వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించాలి .విత్తన పరిశోధన కేంద్రలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం తో పటు , సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని గ్రామీణ వ్యవసికేంద్రాలతో అనుసంధానించాలి . ప్రపంచవ్యాప్తంగా విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 5శాతం కాగా భారతదేశం లో అది 12-15 శాతంగా ఉంది . భారతీయ విత్తన పరిశ్రమ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది దేశంలోని విత్తనోత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు వాటా కలిగిన తెలంగాణ 2014-15 మరియు 2020-21 మధ్య కాలంలో దాదాపు 85 శాతం వృద్ధి చెందింది ,ప్రతి గ్రామానికి విత్తన కేంద్రాన్ని పటిష్టం చేసి నిఘా కేంద్రాల పర్యావేక్షణలో కల్తీ లేని వంగడాల విధానాలను సరఫరా చేయాలిధికవ ర్షాలు, విద్యుతకోతలతో నష్టపోతున్న రైతులకు నా•సిరకం విత్తనాలను సరఫరా చేస్తే దిగుబడి కష్టమే
ఆధునిక వ్యవసాయ పనిముట్లు : ఆధునిక వ్యవసాయ పనిముట్లు : గ్రామీణ వ్యవసాయం లో ఇప్పుడు కూలీలా సమస్య తీవ్ర పరిణా మనగా మారింది వ్యవసాయ అనుకూల వన రులు ఆదికనగా ఉన్న సద్వినియోగం చేసుకొని ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని ఆదర్శనంగా తీసుకోని పంటలను పండించాలి ఈ ఆధునిక వ్యవసాయ పరికరాలు అవటం వలన ఖర్చు తగ్గటమే కాకుండా సమయం వృధా కాదు శ్రమ తక్కువగా ఉండి లాభం పెరుగుతుంది ఉత్పత్తి కూడా ఎక్కువ చేయొచ్చు ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారాము మన ఉత్పతీకి విదేశాల్లో గిట్టు బాటు దర కల్పించాలంటే ఉట్పతుల నాణ్యత పెంచి ఖర్చు తగ్గించాలి అందుకే ఆధునిక పనిముట్ల మరియు యంత్రాల వాడకం దీనికి దోహదం చేస్తుంది వ్యవసాయ పరికరాలు మరియు యంత్ర ల పై మరిన్ని వివివరాలకు సంప్రదించాలిన చిరునామా ప్రిన్సిపాల్ సైంటిస్ట్ (ఆగ్రి ఇంజనీరింగ్ )వ్యవసాయ పరికరాలు మరియు యంత్రాల విభాగం ఆచార్య జయ శంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం హైదరాబాద్‌స్మార్ట్ వ్యవసాయం: గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా వినూత్నమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
దాంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో యాంత్రీకరణ భారీగా పెరిగింది.ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. హైటెక్ యంత్రాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు.అంతేకాదు, పారిశ్రామిక, సాంకేతిక సేవల రంగాల్లో సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్), డేటా ఎనలిటిక్స్… వ్యవసాయంలోనూ కీలకంగా మారుతున్నాయి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా పలు టెక్నాలజీ సంస్థలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. అమెజాన్ వెబ్సర్వీస్ ద్వారా ఆవు పిడకలు లబ్యనౌతున్నాయంటే అర్ధం చేస్కోవచ్చు వ్యవసాయానికి టెక్నిలజి ఎంత అవసరమో రైతులు మూస పద్దతిలో కాకుండా ఆధునిక సైంటిఫిక్ విధానాల్ని అవలంబించాలి వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయంలో డ్రోన్ల వాడకం మీద అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నా యన్నారు. పంట రక్షణ కోసం, పురుగుమం దులను చల్లడానికి, మట్టిని పిచికారీ చేయడానికి ఇలాంటి మానవరహిత వైమానిక వాహనాల ((UAVs) వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (SOPs) విడుదల చేసింది.
పురుగుమందులు చల్లడానికి డ్రోన్లు వాడాలను కుంటే.. అలాంటి డ్రోన్ నియంత్రణ కోసం (SOPs)ల్లో చట్టబద్ధమైన నిబంధనలు, విమానయాన అనుమతులు, దూర ప్రాంత పరిమితులు, బరువు వర్గీకరణ, రద్దీగా ఉండే ప్రాంతాల పరిమితి, డ్రోన్ రిజిస్ట్రేషన్, భద్రతా బీమా, పైలటింగ్ ధృవీకరణ, ఆపరేషన్ ప్లాన్, ఎయిర్-ఫ్లైట్ జోన్లు, వాతావరణ పరిస్థితులు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తాయి
రైతు రాజు:చిన్నపటి నుండి ఇంటున్న ఉతపడమే అయినప్పటికీ రైతు జాగురతః గ లేకపోతె మోసపోయేదే రైతు కాదు దేశమే అన్న పెట్టె రైతన్నలు కన్నీరు పెట్టకుండా ప్రపంచానికి మెతుకు అందించాలంటే అన్ని వర్గాల సహకారం ఎంతో అవసరం దేశ రాష్ట్ర ల సహకారం తో రైతు ను ప్రోత్సహిస్తే కచ్చితంగా అన్న పూర్ణ గ దేశాన్ని మార్చే శక్తి ఒక్క రైతుకే ఉందని చెప్పచ్చు,గ్రామీణ కుటీర పరిశ్రమలని బలోపేతం చేస్తూ గ్రామా సచివాలయాలు ఖనిజ బండాగారాలుగా మారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవ్వాలంటే రైతాంగం సంఘటితమై ఒకే తాటి ఫై నడనడవాలి అప్పుడే జై జవాన్ జై కిషన్ నిజమయిన జిందాబాద్.
డా బీకృష్ణ సామల్ల ,ప్రొఫెసర్ ,ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ 9705890045




