సాగు నీరు, విద్యుత్‌పై…ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం

  • ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదు
  •  దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం
  •  ఆరోపణలను ప్రజలు కూడా నమ్మే ప్రమాదం
  •  త్వరలోనే రైతు రుణమాఫీ…ఎన్నికల తర్వాత స్పష్టత
  •  ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరిం చారు. సాగు నీరు, విద్యుత్‌పై ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతుందని, ఈ ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందని అన్నారు. ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వొచ్చాయని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఇక్కడికి వొచ్చానని తెలియజే శారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ‘విద్యుత్‌-తాగునీరు- ఆర్థికం’ అనే అంశాలపై జరిగి న ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడు తూ…కాంగ్రెస్‌ వొస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించాం న్నారు. తాము వొచ్చిన వెంట నే కొన్ని శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేశామని తెలిపారు. సాగు నీరు, విద్యుత్‌పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండ పిడ్డారు. రైతు బంధు ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేశారని మండిపడ్డారు.

రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారన్నారు. తాము ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఖజానాలో ఉన్నది మైనస్‌ రూ.3960 కోట్లు అని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు, ఉచిత బస్సు ప్రయాణాలకు నిధులు సమకూర్చాలని ఈ సందర్భంగా వివరించారు. గృహలక్ష్మి కింద ఆర్టీసీకి ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఇప్పటివరకు రూ.1,120 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. 4 నెలల్లో 26 వేల కోట్ల అప్పులు కట్టామని చెప్పారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ విధానం గురించి ఆలోచించలేదని ఎద్దేవా చేశారు. నేడు తాము పవర్‌ ఎక్స్ఛేంజ్‌లో రూ.10లోపే విద్యుత్‌ కొంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్‌ పవర్‌ను తక్కువ ధరకు కొంటామని వెల్లడిరచారు. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆకాంక్షతో సీఎం రేవంత్‌ పని చేస్తున్నారని అన్నారు. మంత్రులను, ఇతర నేతలను ప్రజలు కలిసే ఏర్పాట్లు చేశామన్నారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వొచ్చాక విద్యుత్‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మూడు నెలలుగా పీక్‌ డిమాండ్‌ ఉన్నా, కరెంట్‌ కోతలు లేకుండా చూశామన్నారు. ఏప్రిల్‌, మే నెలలో కూడా డిమాండ్‌ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీపీసీతో గత ప్రభుత్వం పీపీఏ చేసుకుంటే, ఈ ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. మారుతున్న సాంకేతికతను గత ప్రభుత్వం అర్థం చేసుకోలేదని, భదాద్రి, యాదాద్రి ప్లాంట్ల కోసం అడ్డగోలుగా అప్పులు చేయాలని ఆలోచించారన్నారు. రాష్ట్రానికి కొత్త విద్యుత్‌ విధానం అవసరం ఉందని తెలిపారు.

రుణమాఫీ చేస్తామనే చెప్పాం కాని 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదన్నారు. త్వరలోనే రుణమాఫీ తప్పకుండా చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థిని బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత స్పష్టంగా విధానపర మైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. సాగునీరు, విద్యుత్‌ ప్రతిపక్షాలవి లేనిపోని అబద్ధాలని,  ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు సిద్ధమని బీఆర్‌ఎస్‌కు భట్టి సవాల్‌ విసిరారు. దిలీప్‌ రెడ్డి మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి, టియూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు ఖాజా విరాహత్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *