ప్రేమను
కొలవడం
విలువకట్టడం
ఎలా సాధ్యం!?
అది
ఉద్వేగపు కెరటాల్తో
ఉప్పొంగే కడలి అయినప్పుడు!….పేదరికపు తీరంలో
ఆకలి తరంగాల్తో
ఘోషిస్తూనేవుంది
బానిసత్వపు సముద్రం-
ఇక ఉద్యమ అల్పపీడనంతో
తప్పదు
నిరసన తుఫాను!…నీ మనసు
అయితేనేం
వొక నిశ్చలమేఘం-
ఆశయాల పవనాల్తో
అది అవుతుంది
జీవనాధార ధారల్ని
కురిపించే తొలకరి రాగం…
కొలవడం
విలువకట్టడం
ఎలా సాధ్యం!?
అది
ఉద్వేగపు కెరటాల్తో
ఉప్పొంగే కడలి అయినప్పుడు!….పేదరికపు తీరంలో
ఆకలి తరంగాల్తో
ఘోషిస్తూనేవుంది
బానిసత్వపు సముద్రం-
ఇక ఉద్యమ అల్పపీడనంతో
తప్పదు
నిరసన తుఫాను!…నీ మనసు
అయితేనేం
వొక నిశ్చలమేఘం-
ఆశయాల పవనాల్తో
అది అవుతుంది
జీవనాధార ధారల్ని
కురిపించే తొలకరి రాగం…
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
(సెల్: 9177732414)
(సెల్: 9177732414)





