సంస్థాగత అభివృద్ధిపై సమీక్షకు ప్రయోజనకారి
గ్రీస్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన
హైదరాబాద్, పిఐబి, ఆగస్ట్ 22 : దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆహ్వానించిన మీదట తాను నేటి నుండి 24 వరకు ‘బిఆర్‌ఐసిఎస్’(‘బ్రిక్స్’) పదిహేనో శిఖర సమ్మేళనంలో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు. మంగళవారం దక్షిణ ఆఫ్రికా అధ్యక్షతన జోహాన్స్ బర్గ్‌లో జరుగనున్న పదిహేనో బ్రిక్స్ శిఖర సమ్మేళనంలో పాల్గొనడానికి ముందు ప్రధాని మోదీ విడుదల చేసిన ప్రకటనలో…బ్రిక్స్ వివిధ రంగాలలో ఒక బలమైన సహకారం సంబంధిత కార్యక్రమాల పట్టికను అమలు పరుస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్• దేశాలు అన్నింటా చేపట్టి తీరవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు బహుళ పార్శ్విక వ్యవస్థలో సంస్కరణలు సహా సమస్యాత్మక అంశాలపై చర్చించడం, పర్యాలోచన జరపడం కోసం బ్రిక్స్ ఒక వేదిక వలె మారిందనే విషయానికి తాము ప్రాధాన్యాన్ని ఇస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఏయే రంగాలలో సహకారం అవసరమో అనేది గుర్తించడంతో పాటుగా సంస్థాగత అభివృద్ధిపై సమీక్షను జరపడం కోసం ఒక ప్రయోజనకారి అవకాశాన్ని ఈ శిఖర సమ్మేళనం అందించనుందని తెలిపారు.
జోహాన్స్ బర్గ్‌లో ఉన్న కాలంలో, బ్రిక్స్ శిఖర సమ్మేళనం సంబంధిత కార్యక్రమాలలో భాగంగా నిర్వహించే ‘బ్రిక్స్-ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ కార్యక్రమంలో కూడా తాను పాలుపంచుకోనున్నానని ప్రధాని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవలసిందిగా ఆహ్వానించినటువంటి అనేక అతిథి దేశాలతో భేటీ కావాలని తాను ఆశిస్తున్నాని అన్నారు. జోహాన్స్ బర్గ్‌కు వొచ్చే నాయకులలో కొంత మందితో ద్వైపాక్షిక సమావేశాలలో పాలుపంచుకోవాలని కూడా తాను ఉత్సుకతతో ఉన్నానని ధ్రాని మోదీ తెలిపారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోతాకిస్ ఆహ్వానించిన మీదట, ఆగస్టు 25న దక్షిణ ఆఫ్రికా నుండి గ్రీస్ లోని ఏథెన్స్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాచీన దేశానికి తన తొలి యాత్ర కానుందని, నలభై సంవత్సరాల అనంతరం గ్రీస్‌ను సందర్శిస్తున్న భారత మొదటి ప్రధాన మంత్రిని అయ్యే గౌరవం తనకు లభించనుందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. మన రెండు నాగరకతల మధ్య గల సంబంధాలు రెండు వేల సంవత్సరాల కంటే పురాతనం అయినటువంటివని, ఆధునిక కాలంలో, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన మరియు బహుళవాదాల యొక్క ఉమ్మడి విలువల ద్వారా మన సంబంధాలు బలపడ్డాయన్నారు. వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ, సాంస్కృతిక సంబంధాలు మరియు ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి వివిధ రంగాలలో సహకారం మన రెండు దేశాలను మరింత చేరువకు తీసుకు వ్తొస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుముఖీనమైనటువంటి మన సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం గ్రీస్‌కు తాను జరిపే యాత్రతో ఆరంభం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.


