- జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ అధినాయకత్వం బుజ్జగింపు
- ఫోన్ చేసి మాట్లాడిన పార్టీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్
- మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం
- జీవన్ ఇంటికి వెళ్లి చర్చించిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు
- రాజీనామా అంశాన్ని ఉప సంహరించుకున్న జీవన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు జీవన్‌రెడ్డి నివాసంలో ఏకాంత చర్చలు జరిపారు. సీఎం హైదరాబాద్‌కు వచ్చి మాట్లాడిన తర్వాత రు ఏం నిర్ణయం తీసుకున్నా అది ఇష్టం. అప్పటి దాకా మా మాట వినాలని శ్రీధర్ బాబు, భట్టి కోరారు. అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్లో మాట్లాడిరచారు. కేసీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డి తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. అయితే జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ మంత్రి పదవి ఆఫర్ చేసిట్లు తెలిసింది. అందుకే ఆయన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు.
ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంతో అసనం వ్యక్తంచేశబురీరు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. 2014లో జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్.. ఆ తర్వాత జరిగిన 2018, 2023 ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసిన ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి జీవన్ రెడ్డికి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరూ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారని సమాచారం.
మ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఇరువురు నేతలు మంతనాలు కొనసాగించారు. ఇందులో భాగంగానే పార్టీ మంత్రి పదవిని ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ కూడా సుముఖంగా ఉంది. కాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా రంగంలోకి దిగారు. ఫోన్ చేసి మాట్లాడారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతామని మున్షీ హా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్లు రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని జీవన్ రెడ్డిని కోరుతున్నారు.
కాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చు కోవడంపై జీవన్‌రెడ్డి కినుక వహించిన విషయం తెలిసిందే. తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు. నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న తనను మాటమాత్రంగాన్కెనా సంప్రదించకుండా తన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇది తనను అగౌరవపరిచినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జగిత్యాల కాంగ్రెస్ నాయకులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వందలాది కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు సైతం సోమవారం ఉదయమే జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రాత్రి వరకూ అక్కడే ఉండి జీవన్‌రెడ్డి ఆవేదనలో పాలుపంచుకున్నారు.



