ఆషాడ మాసంలో వచ్చే పండుగ
గ్రామదేవతలకు మొక్కులు తీర్చే పండుగ
నైవేద్యాలు పెట్టే పండుగ
సంస్కృతి సంప్రదాయాలకు
దర్పణం పట్టే పండుగ
ఆనందాలు వెల్లి విరిసే పండుగ
పసుపు, వేపరెమ్మలతో
ఊరేగించే పండుగ
వర్షాకాలంలో వచ్చే రోగాలను
తరిమేసే పండుగ
శరీరం కుండగా భావించే పండుగ
ఆత్మ దివ్య జ్యోతిగా తెలిపే పండుగ
పోతురాజు చిందులు వేసే పండుగ
అన్నం,పాలు,పెరుగు, బెల్లం,
ఉల్లిపాయలతో కూడిన
బోనం పండుగ
బోనం పెట్టిన మట్టికుంను
నెత్తి మీద పెట్టుకునే పండుగ
పోచమ్మ, ఎల్లమ్మ,మైసమ్మ,
బాలమ్మ,ముత్యాలమ్మ,
పోలేరమ్మ, మహంకాళి అమ్మలను
వివిధ రూపాలలో పూజించే పండుగ
భవిష్యవాణి పలుకులు వినే పండుగ
వనదేవతల కొలువు ధీరే పండుగ
సకల భోగభాగ్యాలను నిచ్చే పండుగ
అదే బోనాలు పండుగ
– గాదిరాజు రంగరాజు
8790122275




