షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక
6.99 లక్షల యువ వోటర్ల నమోదు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 :  ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌తెలిపారు. బీఆర్‌కే భవన్‌లో ఆయన శనివారం వి•డియా సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా వి•డియతో మాట్లాడుతూ…ఎన్నికలకు రెండు, మూడు నెలలు మాత్రమే సమయం ఉందని తెలిపారు. జిల్లాల్లో అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్లుగా చేరారన్నారు. ముఖ్యంగా యువత, మహిళా వోటర్ల నమోదుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 6.99 లక్షల యువ వోటర్లను నమోదు చేయించినట్లు చెప్పారు. మహిళా వోట్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరగనుందని చెప్పారు. అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుందని చెప్పారు. ఈవీఎంల తనిఖీ జరుగుతుందని, తుది వోటర్ల జాబితా పూర్తయ్యాక జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని, షెడ్యూల్‌ ‌ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో అడ్రస్‌ ‌మార్పుల ఫిర్యాదులు వొచ్చాయన్న ఆయన..వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర సీఈఓ వికాస్‌ ‌రాజ్‌ ‌స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కొత్తగా 15 లక్షల మందిని వోటర్ల జాబితాలో చేర్చగా 3.38 లక్షల మందిని వోటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. థర్డ్ ‌జెండర్‌లను, 80 ఏళ్లు పైబడిన వృద్ధులను, పీడబ్ల్యూడీలను గుర్తిస్తున్నామని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు పీడబ్ల్యూడీలను లక్ష మందికి పైగా ఇటీవల గుర్తించినట్లు తెలిపారు. ఇంటి నుంచి వోటింగ్‌ ‌వేసే వారిని గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసీ అధికారులు, పరిశీలకులు త్వరలో జిల్లాల్లో పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో, కలెక్టర్లు, ఎస్పీలతో, సీఎస్‌తో ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే నిర్ణీత సమయానికి ఎన్నికల షెడ్యూల్‌ ‌రాకపోతే, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉం‌దని పలు పార్టీలు భావిస్తున్నాయి.

ఈ క్రమంలో తెలంగాణ సీఈఓ వికాస్‌ ‌రాజ్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ.. షెడ్యూల్‌ ‌ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు ఇదివరకే మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ఏర్పాట్లను సవి•క్షించేందుకు అక్టోబర్‌ 3 ‌తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈసీ టీమ్‌ ‌రాష్ట్రానికి రానుంది. త్వరలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కమిషనర్‌ ‌రాజీవ్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఏర్పాట్లను సవి•క్షించనున్నారు. ఇందులో భాగంగానే సీఈసీ తెలంగాణలో తాత్కాలిక పర్యటన తేదీలను రాష్ట్ర అధికారులకు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల అధికారులు వోటర్ల జాబితా నుంచి పోలింగ్‌ ‌కేంద్రాలు, పోలీసు బందోబస్తు, బోగస్‌ ‌వోటర్ల ఏరివేతపై పనిచేస్తున్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ ‌రాజ్‌ అధికారులతో సవి•క్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సిరీస్‌ ‌తో 13 నుంచి 14 అంకెలతో ఉన్న వోటరు గుర్తింపు కార్డులను అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా వోటరు కార్డు సంఖ్య 10 అంకెలకు తగ్గించడం తెలిసిందే. రాష్ట్రంలోని 47 లక్షల 22 వేల మంది వోటర్ల కార్డు నంబర్లు మారగా, నూతన ఫొటో వోటరు కార్డులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వి• సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని కొత్త కార్డులను పొందవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *