శ్రీ రాముడు, హిందువుల ఆరాధ్య దేవుడు, తన అద్భుతమైన లక్షణాలు మరియు గుణాలకు ప్రసిద్ధి చెందాడు. ఆయన జీవితం మానవాళికి ఒక ఆదర్శం గా నిలిచింది, ధర్మం, నీతి, సత్యం యొక్క అమోఘమైన శక్తితోఅద్భుతమైన శక్తితో కూడిన వ్యక్తి. ఆయన రాక్షసులతో యుద్ధం చేసి, వారిని ఓడిరచగలిగాడు. ధార్మిక నిబద్ధత రాముడు ధర్మం పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉన్నాడు.తన తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి, వనవాసం గడపడానికి అంగీకరించాడు. రాముడు తన పెద్దల పట్ల ఎంతో అనుగుణ్యత కలిగి ఉన్నాడు. తన తండ్రి ఆజ్ఞలను ఎప్పుడూ ధిక్కరించలేదు. రాముడు ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడేవాడు. ఆయన వాగ్దానాలను ఎప్పుడూ నెరవేర్చేవాడు. రాముడు ఎంతో దయగలవాడు.రాముడు ఎల్లప్పుడూ పెద్దల పట్ల గౌరవంగా ఉండేవాడు. స్త్రీలను ఎంతో గౌరవించేవాడు. రాముడు ఒక ఆదర్శ పురుషుడు.ఆయన భార్య సీత పట్ల ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉన్నాడు. రాముడు ఎంతో క్షమాపణ కలిగిన వ్యక్తి.రావణుడి తమ్మడు విభీషణుడిని క్షమించి,ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు.రాముడు ఒక గొప్ప నాయకుడు.ఆయన వనవాసంలో ఉన్నప్పుడు,తన వెంట వచ్చిన వారిని ఎంతో జాగ్రత్తగా కాపాడాడు.
రాముడు ఒక ఆదర్శ పురుషుడు.ఆయన జీవితం మానవాళికి ఒక మార్గదర్శకంగా నిలిచింది. రాముని ఈ విశిష్ట లక్షణాలు ఆయనను హిందువులకు అత్యంత ప్రియమైన దేవుడిగా చేశాయి.ఆయన జీవితం మనకు నేటికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. శ్రీరాముడి చరిత మీద నాటి వాల్మీకి రామాయణం నుంచి నేటి ‘‘శ్రీరామసుందర స్తోత్రలహరీ’ వరకు ఎందరో కవులు పండితులు మేధావులు ఋషులు,రచయితలు, పండితులు, తమదైన శైలిలో వివిధ యుగాలలో కాలాలలో రామాయణం గురించి రాముడి యొక్క విశిష్టతను గురించి అనేక గ్రంథాలను రచించడం జరిగింది. వీటిల్లో ఈ మధ్యకాలంలో ప్రముఖ కవి రచయిత సాంస్కృతాంధ్ర పండితులు, బహుభాషా కోవిదులు, తునికిపాటి భాను రాష్ట్ర సంస్కృత విద్యాపీట్ తిరుపతి నుండి సంస్కృతంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుండి తెలుగులో మాస్టర్ డిగ్రీ తీసుకొని అనేక ఆధ్యాత్మిక విషయాలపై 400 కి పైగా ఆసుపద్యలను రచించి ఉన్నారు. దీవిలో భాగంగా శ్రీరాముడు యొక్క విశిష్టతను తెలియజేస్తూ ‘‘శ్రీరామ సుందర స్తోత్రలహరీ’ అనే గ్రంధాన్ని 101 సంస్కృత శ్లోకాలతో శ్రీరాముని కీర్తిని విశిష్టతను చాలా క్లుప్తంగా నేటి సమాజానికి, యువతకు, ఆధ్యాత్మికవేత్తలకు అతి సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వివర్ణాత్మకంగా అత్యున్నతమైన అందమైన భాష పద ప్రయోగాలను ఉపయోగించి ఒక అద్వితీయమైన గ్రంథాన్ని మన ముందుకు తీసుకొచ్చారు.
సాక్షాత్ విష్ణు స్వరూపంచ సకలార్ధ ప్రదాయకమ్!
సీతాపతిం మహాకాయమ్ శ్రీరామం ప్రణమామ్యహామ్!!
సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, సకల సంపదలను ఇచ్చేడివాడు, సీతాదేవి భర్త, గొప్ప శరీరం కలవాడగు శ్రీరామచంద్రునిని నేను నమస్కరిం చుచున్నాను. అని శ్రీరాముడు ప్రాధాన్యతను తెలియజేశారు.
బలాతి బలవిద్యాభ్యాం శోభితం పూజ్య పుంగవమ్!
లావణ్యగుణభూయిష్టం శ్రీరామ ప్రణమామ్యహామ్!!
బల,అతిబల అను విద్యలచేత శోభించేవాడు, పూజ్య పుంగవుడు, లావణ్యగుణము కలవాడు అగు శ్రీరామచంద్రునిని నేను నమస్కరించుచున్నాను.
యుద్దేభయంకరాకారం చండమార్తండతేజసమ్!
రౌద్రనేత్రం మహావీరం శ్రీరామం ప్రణమామ్యహమ్!!
యుద్ధమునందు భయంకరమైన ఆకారంగలవాడు, ప్రచండమైన సూర్యునివంటి వెలుగు కలవాడు, కోపంతో కూడిన నేత్రాలుకలవాడు, మహావీరుడు అగు శ్రీరామచంద్రునిని నేను నమస్కరించుచున్నాను.
ఏకపత్నీవ్రతాచారతత్పరం ప్రాణరక్షకం!
ఐహితార్ధప్రధాతారం శ్రీరామ ప్రణమామ్యహమ్!!
ఏకపత్నీవ్రతాచారతత్పరుడు, ప్రాణరక్షకుడు, కోరిన కోరికలను ఇచ్చేవాడు అగు శ్రీరామచంద్రునిని నేను నమస్కరించుచున్నాను.
మంత్రరూపం తంత్రరూపం యంత్రరూపం మహేశ్వరమ్!
సర్వశాస్త్రాదరందేవం శ్రీరామ ప్రణమామ్యహమ్!!
మంత్రరూపుడు, తంత్రరూపడు, యంత్రరూపుడు, మహేశ్వరుడు, సర్వశాస్త్రములను ధరించినదేవుడు అగు శ్రీరామచంద్రునిని నేను నమస్కరించుచున్నాను.
నిత్యం మందస్మితాకారమ్ సర్వలక్షణలక్షితమ్!
మహావీర్యం మహాకాయం శ్రీరామం ప్రణమామ్యహమ్!!
నిత్యం చిరుహాసము కలవాడు, సర్వలక్షణలక్షితుడు, మహావీరుడు, మహాకాయుడు అగు శ్రీరామచం ద్రునిని నేను నమస్కరించుచున్నాను.
నవరత్నదరం దేవం నవవారం నమామ్యహమ్!
దశాననమారకం తం దశవారం నమామ్యహమ్!!
నవరత్నములను ధరించినవానిని నేను తొమ్మిదిసార్లు నమస్కరించుచున్నాను. దశననుని సంహరించిన రామునిని నేను పది సార్లు నమస్కరించుచున్నాను.
చంద్రకాంతిస్వరూపం తం తిమిరాంధనివారకమ్!
తేజాకారం శుద్ధరూపం కాంతిరామం నమామ్యహమ్!!
చంద్రునికాంతి వంటి కాంతిగల స్వరూపుడు, అజ్ఞానమనే చీకటిని నివారించేవాడు, తేజముతో కూ డిన ఆకారం కలవాడు శుద్ధరూపుడు అగు కాంతి రామునిని నేను నమస్కరించుచున్నాను.
వారం వారం రామనామస్మరణాత్ ముక్తిదాయకమ్!
సుఖైశ్వర్యాది దాతరం రామచంద్రం నమామ్యహమ్!!
మాటిమాటికి రామనామస్మరణచేత ముక్తిని ప్రసాదిం చువాడు, సుఖమును మరియు ఐశ్వర్యమును ఇచ్చువాడవు శ్రీరామచంద్రునిని నేను నమస్కరిం చుచున్నాను. అంటూ రచయిత తునికి పాటి భాను తనదైన శైలిలో శ్రీరాముని సంస్కృతం శ్లోకాలతో కీర్తించాడు. శ్రీరామ నామ స్మరణతో ఎంతటి అజ్ఞానులైనా విజ్ఞానవంతులవుతారని మనకు వాల్మీకి ద్వారా అర్థమైంది ఏ కాలంలోనైనా రామనామ స్మరణం కలకాలం సుఖాన్ని శాంతిని సంతోషాన్ని అందిస్తుందని మనకు ఈ గ్రంథం ద్వారా అర్థమవుతుంది.
శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే!
సహస్రనామతత్తుల్యం రామనామవరాననే!!
శ్రీరామ నామ స్మరణం చేద్దాము, శ్రీరాముడిలోని సద్గుణాలను అలవర్చుకొని సమాజ శ్రేయస్సు కై పాటుపడుదామని మనవ చేసుకుంటూ శ్రీరామ సుందర స్తోత్రలహరీ మనకు అందించిన తునికి పాటి భాను రచయితకి ఒకసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో భక్తి తత్పురా గ్రంథాలను మనకి అందిస్తాడని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్.
-పూసపాటి వేదాద్రి
9912197694





