వోటమి తట్టుకోలేక వివాదం

బిఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ నేత విజయశాంతి ఫైర్‌
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : సుమారు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి 5 లక్షల రూపాయల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, అందుకు బాధ్యులైన నాటి బిఆర్‌ఎస్‌ మంత్రులు మూడు దినాలల్లనే నూతన సర్కారు అన్ని హామీలను అమలు చేయాలని ప్రశ్నించడం… ప్రతిపక్షంగా అన్ని తెలిసి చేస్తున్న మోసపు ప్రకటనలు, ప్రయత్నం వోటమి తట్టుకోలేని వ్యక్తులు చేస్తున్న వివాదంలా ఉందని కాంగ్రెస్‌ నేత విజయశాంతి ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటనను విడుదల చేస్తూ…విజ్ఞత, బాధ్యతా ధోరణితో ఉండే హరీష్‌ రావుతో కూడా ఇట్ల ఎందుకు మాట్లాడిస్తున్నారో దవాఖానలో ఉన్న కేసీఆర్‌కు తెల్వదా అని ప్రశ్నించారు.

అయినా, మాట ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పదు అన్నది వాస్తవం…అందుకై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని, ప్రభుత్వాన్ని విమర్శించే శక్తులను సమర్థవంతంగా తిప్పికొట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ కార్యాచరణను నిరంతరం ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ఉందని, ఈ సందర్భంగా  తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీ నియంతృత్వ గడీల నుండి విముక్తికై కొట్లాడి నేటి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకై పనిచేసిన తన వంటి తెలంగాణ ప్రజాస్వామ్యవాదులపై ఉందని ఆ ప్రకటనలో విజయశాంతి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *