వైఎస్‌ఆర్‌కు ఇడుపులపాయలో ఎపి సిఎం జగన్‌ ‌నివాళి

కుటుంబ సభ్యలతో కలసి తండ్రికి శ్రద్ధాంజలి

కడప, సెప్టెంబర్‌ 2 : ‌దివంగత మహానేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ‌ఘాట్‌ ‌వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ ‌విజయమ్మ, వైఎస్‌ ‌భారతి, వైఎస్‌ ‌షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ ‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. వైఎస్సార్‌ ‌ఘాట్‌ ‌వద్ద వైఎస్సార్‌కు నివాళి అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్‌ ‌సక్ష చేపట్టారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సక్ష జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *