పాట్నా సమావేశంపై మంత్రి కెటిఆర్ స్పందన
దేశానికి కాంగ్రెస్, బిజెపి చేసిందేవి• లేదు
అందుకే రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నాం
హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేస్తాం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కెటిఆర్
కంటోన్మెంట్ భూములు బదలాయించాలని వినతి
న్యూ దిల్లీ, జూన్ 23 : రాజకీయ పార్టీలు ఒక్కటి కావడం ముఖ్యం కాదని, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా..ప్రజలంతా ఏకం కావడం ముఖ్యమని దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని ఆయన విమర్శించారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం పలు విపక్ష పార్టీ నేతలు సమావేశం కావడంపై కెటిఆర్ స్పందిస్తూ…రెండు పార్టీల వల్లే దేశంలో సమస్యలు ఉత్పన్నమైనట్లు చెప్పారు. ఒకవేళ విపక్ష పార్టీలన్నీ రాజకీయంగా బీజేపీ వైపో లేక కాంగ్రెస్ వైపో మళ్లితే అప్పుడు దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ దేశానికి తీరాని నష్టం చేశాయని, అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడు రోసుల దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం వి•డియాతో మాట్లాడుతూ…స్వాతంత్య భారత దేశంలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని అన్నారు.
హైదరాబాద్ కేంద్రగా తాము జాతీయ రాజకీయాలు చేస్తామని..దిల్లీ ప్రభుత్వ అధికారులను కేంద్రం చేతుల్లో పెట్టుకునే ఆర్డినెన్సును తాము వ్యతిరేకిస్తామని, ఉభయ సభల్లో దీనికి వ్యతిరేకంగా వోటు వేస్తామమని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పండుగలా జరిగాయని, అమరవీరులకు అసలైన నివాళి అర్పించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉత్సవాల్లో పాల్గొన్న వాళ్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, టీకా ఉత్పత్తికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం చేయూతనివ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కేటీఆర్ బృందం కలిసింది. కంటోన్మెంట్‌లో స్కైవేల నిర్మాణంపై వినతిపత్రం అందజేసింది. రక్షణశాఖ భూముల గురించి కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రక్షణశాఖ ఇచ్చిన స్థలాలకు…సమానమైన భూమిని మరోచోట ఇస్తామని చెప్పామని, 9 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామన్నారు. ఇప్పటికీ కేంద్రం ఒప్పుకోవడం లేదని చెప్పారు.
మెట్రో విస్తరణకు కూడా ప్రతిపాదనలు ఇచ్చామని, ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించామని తెలిపారు. లక్నో, అహ్మదాబాద్‌లో కంటోన్మెంట్ భూములు మెట్రోకు ఇచ్చారని, ప్రజారవాణా కోసమే అడుగుతున్న పనులకు కేంద్రం సహకరించాలన్నారు. మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టులో కేంద్ర వాటా నిధులు ఇంకా ఇవ్వలేదని, కొత్తగా 31 కీ.వి• మేర మెట్రోను విస్తరించాలని భావిస్తున్నామని కేటీఆర్ అన్నారు. స్కైవాక్స్, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం హైదరాబాద్‌లోని రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన రక్షణ మంత్రిని కోరారు. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సవి•పిస్తున్న తరుణంలో కెటిఆర్ దాదాపు ఏడాది తర్వాత దేశ రాజధానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన మూడు రోజుల దిల్లీ పర్యటనలో కెటిఆర్ కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, హర్దీప్ సింగ్ పురీలను కలుసుకుని తెలంగాణలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

ఇంకా వి•డియాతో కెటిఆర్ మాట్లాడుతూ… తెలంగాణను ఆదుకోవాలని తాను గతంలో కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రగతికి మద్దతు కోసం గత తొమ్మిదేళ్లలో 15 నుంచి 20 సార్లు కేంద్ర రక్షణ మంత్రులను కలిశానని, స్కై కారిడార్ల నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ నుంచే దేశంలో 44 శాతం ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కెటిఆర్ వివరించారు. టీకా ఉత్పత్తిలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ మారిందని, ఫార్మా, ఐటి, బయోటెక్, ఏరోస్పేస్ రంగాలలో వేగంగా అభివృద్ధి చెంతుతుందని ఆయన చెప్పారు. శనివారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీతో సమావేశమై శంషాబాద్ విమానాశ్రయాన్ని కలిపే మెట్రో ప్రాజెక్టు రెండవ దశ గురించి చర్చించనున్నట్లు కెటిఆర్ తెలిపారు.




