నునులేత ప్రాయంలోనే
గ్రామపెద్దలతో పెళ్లి తంతు
తుదకు ఊరు ఉమ్మడి ఆస్తి
ఇదీ ‘జోగిని’ వ్యవస్థ దుస్థితి
దేవదాసి,మాతంగి వశ్రీ
జోగిని ఇలా ఊరికో పేరు
దేనికి కొరగాని జీవన తీరు
శారీరక దోపిడీకి
సాంఘీక అణిచివేతకు
గురయ్యే వెట్టి జీవులు
అందరి సొమ్మై …
అంగడి బొమ్మై …
అనామక గుమ్మై
దురాచార వ్యవస్థలో…
మగ్గుతున్న అభాగ్యులు
మనసును చంపి..
తనువు సర్వస్వం
కాముకులకు పంచే
కొడిగట్టే గ్రామ దీపాలు
ఏ ఆధా(ర్)రం అందని
ఏ అభ్యున్నతికి నోచని
తరాల విధి వంచితులు
ఏ వ్యవస్థకు పట్టని
ఏ ఎలికులకు గిట్టని
ఏ చరిత్రలకు ఎక్కని
అనామక జీవత్సవాలు
ఈ సామాజిక దురాచార
జాడ్యం కడతెరిది ఎన్నడో !
మోడువారిన బతుకుల్లో
నవ వసంతం విరిసేదెపుడో!
(జోగినిల జీవన చిత్రం ఆవిష్కరిస్తూ….)
– కోడిగూటి తిరుపతి, 9573929493




