విదేశీ అప్పులపై ఆధారపడటటం మాని, సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పాకిస్తాన్ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్ అన్నారు. ఖానేవాల్ మోడల్ అగ్రికల్చర్ ఫామ్లో జరిగిన ఓ కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావ ంతులు, గర్వించదగినవారు. పాక్ వాసులు కచ్చితంగా బెగ్గర్స్ బౌల్ (చిప్ప)ని విసిరేయాలి‘ అని వ్యాఖ్యానించారు. అన్ని రకాల శక్తులను పాక్కు భగవంతుడు ఇచ్చాడని ఆసిం మునీర్ అన్నారు.
తమ దేశ ప్రగతిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని తెలిపారు. దేశం, ప్రజల మధ్య తల్లీబిడ్డల బంధం ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడే వరకు పాక్ ఆర్మీ విశ్రమించదని మునీర్ స్పష్టం చేశారు. త్వరలోనే పాక్ ఓ వ్యవసాయ విప్లవాన్ని చూస్తుందని జోస్యం చెప్పారు. తాము దేశం మొత్తం మోడల్ ఫామ్లను ఏర్పాటు చేస్తామని ఆయన హా ఇచ్చారు. ఇవి చిన్న రైతులకు ఆధునిక సేద్యంలో సాయం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. చైనా నుంచి మరో భారీ రుణం అందుకోవడానికి పాకిస్తాన్ సిద్ధమైన సమయంలో ఆర్మీచీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇటీవల ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరో 600 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందేందుకు ప్రయత్నాలు తీవ్రం చేసిన విషయం తెలిసిందే.




