క్రౌర్యానికి బలి అయిన అబలవు నీవు
కాఠిన్యానికి కరిగిన సమిధవు నీవు
మగవాడి బలవంతపు రతికి బందీవి నీవు
విధివిధవను చేస్తే బజారున విసిరిన పిల్లల తల్లివి నీవు
ఏది తల్లి నీ జెండా
ఈ వజ్రోత్సవపు రహదారుల బారులలో
ఈ ఉషోదయాన
నిన్ను వెతుక్కుంటూ
విషాద నయనాలు ఒత్తుకుంటూ
ఏ చీకటి గదుల్లోనో నిన్ను వెతుక్కుంటూ..
నేనొంటరిగా
నా కనుల కొలనుల్లో
నీ ప్రతిబింబం కానరాదే తల్లి?
ఏవి తల్లి ఈ వజ్రోత్సవ ఉషోదయ కిరణాలు?
ఏది తల్లి
ఈ వేడుకల రణ గొణ ధ్వని నడుమ
నీ బాధ తప్తమూలుగు
ఏ చీకటి గొయ్యారల్లో బందీవయ్యావు?
నేల మాళిగల లోంచి
నీ పిలుపు కోసం
చకోర పక్షిలా
విహరిస్తున్న ఒంటరి బాటసారిని
సూర్యాస్తమయంలో నా ఉషోదయానివి నీవు.
– కోట దేవదానం బిఏ, ఎల్‌ఎల్‌యం
రిటైర్డ్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ (న్యాయవాది)
భద్రాచలం, 9705693226




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల