నేడు రంగాచార్యుల వర్ధంతి
శ్రీ రామానుజుల వారి శిష్యరికంలో ఎదిగిన దాశరధి సోదరుల అపూర్వ రచనలు అనిర్వచనీయం సామాన్య ప్రజల వాడుక భాషను వినియోగించి రచనలను చేశారు దాశరథి• రంగాచార్యులు. అభ్యుదయ రచయితల సంఘంలో ఘననీయమైన పాత్రను పోషించారు శ్రామిక వర్గ ప్రజలకు చేరువై అభ్యుదయ భావాలను ప్రేరేపించి సమానత్వాన్ని స్థాపించిన మహనీయులు దాశరథి• రంగాచార్యులు .నేడు వారి వర్ధంతి సందర్భంగా ..
జన్మస్థానం…. బాల్యం.
దాశరథి• రంగాచార్యులు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూర్ గ్రామంలో వెంకటాచార్యులు వెంకటమ్మ పుణ్య దంపతులకు రెండో సంతానంగా 24 ఆగస్టు 1928లో జన్మించారు బాల్యం నుంచి రంగాచార్యులు ఆలోచనా పటిమను కలిగినవారే వారు నైజాం నవాబుకు జరిగిన వ్యతిరేక కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవారు ఏడవ ఏటని నిజామును ఎదిరించి రాజ ద్రోహి ముద్రను వేయించుకున్న తన పోరాట పటిమను విడనాడలేదు .సమాజ పరిస్థితులకు చెల్లించే హృదయం కలిగిన దాశరధి సోదరులు సమాజంలో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచిన సంఘటనలు అనేకం చిన్ననాటి బాల్య మిత్రుడు తో కలిసి ఊరి సమీపంలో ఉన్న ముత్యాలమ్మ కుంట( సరస్సు) అందాలను వీక్షించే ధోరణిని అలవర్చుకున్నారు ఈ క్రమంలోనే నవల రచనకు అంకురార్పణ జరిగింది. తన ఆత్మకథ స్వీయ జీవన యానంలో ఊరు చెరువుతో గల సంబంధాన్ని ఇలా వివరించారు…
మంచి ఊరు మంచి మనసు కలిగిన మా ఊరు చిన్న గుడూరు .. గ్రామంలో అందరూ వివిధ వరుసలలో ఆప్యాయంగా పిలుచుకునే సంప్రదాయం అందరూ మనవాళ్లే అన్న భావనతో గ్రామస్తులు మెలిగే వారు. గ్రామ శివారులో ముత్యాలమ్మ కుంట అందులో నిలిచిన నీరు సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు వెండి వెలుగులతో కనిపించిన తీరు మనసును ఆహ్లాదాన్ని కలిగించేవి. మరోవైపు చెరువు నిండా దట్టంగా అల్లుకున్న తామర పుష్పాల సోయగం వర్ణనాతీతం.. పుష్ప అందాలను తిలకించేందుకు తాను ప్రతిరోజు క్రమం తప్పకుండా కుంటను సందర్శించే వారిని చెప్పుకొచ్చారు. చెరువు కట్టపై మోదుగు చెట్లు కట్టకింది భాగంలో బ్రహ్మజెముడు నాగజెముడు వంటి చిట్టడుగులు ఉండేవి చెరువు కట్ట కింద అందమైన పచ్చని పొలాలతో భూమాత అలారారుతున్నట్లు దర్శనమిచ్చేది. ఇంకాస్త దూరంలో మామిడి చెట్లు ఉండేవి వాటికి కాసిన మామిడి పండ్లు రుచి అతి మధురంగా ఉండేది అన్నారు.. ఈ విధంగా దాశరథి• రంగాచార్యులు తన బాల్యంలో గడిపిన కొన్ని స్మృతులను జ్ఞప్తి చేసుకొని మురిసిపోయేవారు. తన ఇంటి ముందు ఉన్న చింత తోపు సైతం తన రాజ్యములకు దోహదం చేసినట్లు చెప్పారు. చింతతోపు వేసవిలో చల్లదనాన్ని ఇస్తూ క్షేత్ర కాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేది చింత సమీపంలో బొడ్డు మల్లెల చెట్లు ఉండేదని వాటిని తీసుకునేందుకు ఆ గ్రామానికి చెందిన ఓ అమ్మాయి రోజు వచ్చేది. ఈ సమయంలో వారి ఇరువురికి పరిచయం ఏర్ప డింది ఆ పరిచయంతో తన బాల్య స్నేహితుడిని పిలిపించి బొడ్డు మల్లెల చెట్టుపైకి ఎక్కించి పూలు దులుపుమని కోరేవారు. పూలు దులిపిన అనంతరం అమ్మాయి వొడినిండా పూలు నిండితే సంతోషించేవారు. పూలను ఆ అమ్మాయి ఓ పద్ధతిలో మాలగా అల్లడం ఆయనకు అమితమైన ఇష్టం.. ఆమె పూలను అల్లే సమయంలో సైతం ఆమెను పరీక్షించేవారు…
బాల్యం నుంచే ఉద్యమ పంథా….
దాశరథి• రంగాచార్యులు బాల్యం నుంచే ఉద్యమ పంథాలు అలవర్చుకున్నారు. నాడు గ్రామంలో జరుగుతున్న పాలనను వ్యతిరేకి ంచారు. గ్రామంలో నరసింహస్వామి గుడి రాములోరి గుడిలో నాటి పాలకులకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు సమావేశాల నిర్వహణ ఫలితంగా సమ్మె చేయాల్సి వచ్చింది. దీంతో పాఠశాల విద్యార్థిగా పాఠశాల నుంచి బహిష్కృతుడయ్యారు. పాఠశాల నుంచి ఇంటికి చేరుకోగానే తన తండ్రి వెంకటాచార్యులు మందలించేవారు. తాను పాలకుల వ్యతిరేక విధానాలపై పోరాడినందుకు గాను తనను రాజ ద్రోహిగా ముద్రించారు.. ధరలు చేసిన దారుణాలను తిప్పికొడుతూ నిజాం కు వ్యతిరే కంగా పనిచేయడం నాటి నుంచే మొద లుపెట్టారు. నాటి పాలకులు భాషను యాసను తొక్కిపెట్టారు.. తెలుగును ఐచ్చిక సబ్జెక్టుగా గుర్తించారు. ఉర్దూని ప్రోత్సహించి ఇతర భాషలను విస్మరించారు భాషా సంస్కృతిని తొక్కి పెట్టారు భాషాపరమైన ఆంక్షలు విధించేవారు. ఈ సమయంలో ప్రముఖ కవులు సైతం ఈ వివక్షను ఎదురుకోవలసి వచ్చింది.
నవలా రచనకు శ్రీకారం……
తెలుగు భాష వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ఇతర భాషలను ప్రోత్సహించేవారు. ఈ సమయంలో దాశరథి• రంగాచార్యులు రాసిన మోదుగు పూలు అనే నవలను ప్రజలు చదవడానికి నిషేధించారు గ్రామ అధికారులు. తెలుగు సాహిత్యంలో అరుదైన రచనలు చేశారు దాశరథి రంగాచార్యులు. తెలంగాణ సామాజిక వాతావరణాన్ని రైతాంగ పోరాట ప్రకంపనలను సాహిత్య పరంగా మార్చిన కవి దాశరధి రంగాచార్యులు.. సహజమైన తెలంగాణ భాష చిన్న చిన్న వాక్యాలతో వేగంగా సాగించాలి జీవహిత తత్వాన్ని కలగలిసి రచించే ఇతివృత్తాలు రంగాచార్యుల రచనకు సాత్విక రాణింపు తెచ్చాయి. ఆయన లక్షణ సాధనకు వాహికగా అక్షరాలను ఎంచుకున్నారు చైతన్యం చేసే రచనలకు శ్రీకారం చుట్టారు. నిజాం పరిపాలనలో తెలంగాణ జీవిత చరిత్రను ప్రతిబింబిస్తూ దాశరథి రాసిన నవల మోదుగు పూలు నవల 1943 నుంచి 48 లో భారత దేశంలో స్వాతంత్ర ఉద్యమం ఉధృతమై నాటి నుంచి తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుండి స్వేచ్ఛ లభించే వరకు వర్ణించబడింది. ఈ నవల నాటకంలో కూడా ప్రదర్శించబడింది. 1944- 51 మధ్య తెలంగాణలో నెలకొన్న ప్రజా పోరాటాన్ని చిత్రించిన నవల ఈ నేపథ్యంలో జాగిర్దారి ప్రాంతంలో ఎలాంటి ఆకృత్యాలు అరాచకాలు క్రమంగా చైతన్యవంతులైన ప్రజలు అధికార వర్గాలను వారి పీఠాలను ఎలా కదిలించాలో మోదుగు పూలు నవలలో ఉంటుంది. సాంకేతికంగా నవలలు ఉన్నది కోయకూడని ఆయన తెలంగాణ అంతట అవే పరిస్థితిలో నెలకొని ఉన్నాయి.
తెలంగాణ నాటి సాయుధ పోరాటం నాటి స్థితిగతులు ఆ కాలములో దారుణమైన బానిస పరిస్థితులను మోదుగు పూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి పరిస్థితులు అనంతర పరిస్థితులు జనపదంలో ఆకర్షించాయి. వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి గంగు వంటి నవలల ద్వారా నేటి జీవన చిత్రణ చేయాలని ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవల ప్రణాళిక పూర్తికా కుండానే ఆలవారు స్వామి మరణించారు. సాయిధ పోరాట యోధులుగా సాహిత్య వేత్తలుగా ఆళ్వార్ స్వామికి రంగాచార్యులకు సాన్నిత్యం ఉండేది. ఆయన చిల్లర దేవుళ్ళు నవల సినిమాగా తీశారు. డీ. మధుసూద నారావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. చిల్లర దేవుళ్ళు నవల నాటి తెలంగాణ దుర్భర జీవన చిత్రాన్ని చిత్రీకరించింది. 1963 లో శ్రీమద్రామాయణం, 1963 లో రణభేరి, 1969 లో చిల్లర దేవుళ్ళు, 1971లో మోదుగు పూలు, 1974లో రానున్నది ఏది నిజం, 1976లో జనపదం, 1988లో దేహదాసు ఉత్తరాలు, 1995లో శ్రీ మహాభారతం, 1999లో జీవరయానం, 1978లో శరత్ ఆల్ఫా చతుర్వేద సంహిత, 2001లో అమృత ఉపనిషత్తు వంటి రచనలు దాశరథి రంగాచార్యులు చేశారు.
వృత్తి గతం…. 1951 సంవత్సరం నుంచి 1957 సంవత్సరం వరకు ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1957 సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చేరి ఉద్యోగం చేస్తూనే బిఏ ఎల్ఎల్బి చేశారు. 32 సంవత్సరాల పాటు పనిచేసి 1998లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగ విరమణ చేశారు. అనువాదకుడిగా వేదాలను సామా న్యుడికి సైతం అందజేయాలని ఆలోచనతో కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. విస్తృత సాహిత్యాన్ని సరళమైన తెలుగులోకి చేయడం ఆయన సామర్థ్య పటిమను తెలంగాణకే కాక ప్రపంచానికి సైతం తెలిపింది. ఆయన 15వ ఏటని కమలాదేవిని వివాహం చేసుకున్నారు తన రచన సమయంలో మహాత్ముడిని సైతం కీర్తించారు. మహాత్ముడిని దర్శిస్తే దేవుడిని దర్శించినట్లేనని భావించాలని తెలిపారు. చివరకు జూన్ 8 2015లో ఆయన కలలు కన్న తెలంగాణ రాష్ట్ర అవతరణను చూసి అనంత లోకాలకు వెళ్లారు.
– భర్త పురం వెంకట మల్లేష్
ఎం ఏ టి పి టి, ఎంసీజే సెంట్ అగస్టీన్ పాఠశాల, మరిపెడ బంగ్లా 9949872371.




