రైతులపై కాంగ్రెస్‌ ‌పార్టీ కక్ష కట్టింది

రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం
రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం
సమావేశంలో హరీష్‌ ‌రావు హెచ్చరిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు.రైతుబందు పొందిన 69 లక్షల రైతులు కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడతారని హెచ్చరించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో డియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా రూ.75 వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే.. కేసీఆర్‌ ‌రైతులకు డబ్బులు పంచారని అన్నారు. కాంగ్రెస్‌ ‌నాయకులు ఏం చెప్పినా ప్రజలు ఓట్లు వేయరు. 69 లక్షల మంది రైతులు కేసీఆర్‌ ‌కు అనుకూలంగా ఉన్నారు. రైతు బంధు తరహాలోనే పెన్షన్లు, కేసీఆర్‌ ‌కిట్‌ ‌కూడా అపమంటారేమో అనిపిస్తోంది.

రైతుల జోలికి వస్తే కబర్ధార్‌ అని హెచ్చరిస్తున్నా. డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరిస్తున్నాము. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హాలు అమలు కావడం లేదు. కర్ణాటక ప్రజలు కొడంగల్‌, ‌గద్వాల్‌ ‌లో కరెంట్‌ ‌విషయంలో ఆందోళన చేశారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్‌ ‌కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్‌ ‌పాలనలో నాణ్యమైన కరెంట్‌ ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నాం.  కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బందు కేసీఆర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌పార్టీ రైతులకు శత్రువుగా మారింది. రేపు కాంగ్రెస్‌ ‌పార్టీ వస్టే రైతు బంధుకు రాం రాం చెబుతారు. కేవలం మూడు గంటల కరెంట్‌ ‌మాత్రమే ఇస్తారు. 11సార్లు కాంగ్రెస్‌ ‌కు అధికారం ఇస్తే ఒక్క పైసా ఇవ్వలేదు. మాకు రెండు సార్లు అవకాశం ఇస్తే 11 సార్లు రైతు బంధు ఇచ్చాము. ఒక నెల రోజులు కాంగ్రెస్‌ ‌కుట్రలతో పథకాలు ఆగినా మళ్ళీ మేం అధికారంలోకి రాగానే ఇస్తాం. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని అన్నారు.

రైతుబంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేయడం రైతుల పట్ల కాంగ్రెస్‌ ‌వైఖరిని స్పష్టం చేస్తోందని.. మరోమారు కాంగ్రెస్‌ ‌రైతుల పట్ల వ్యతిరేకతను చాటుకుందని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ‌తలకిందులు తపస్సు చేసినా రైతుబంధు లబ్దిదారులు కాంగ్రెస్‌కు ఓటు వేయరన్నారు. అందుకే రైతుల ద కక్ష పెంచుకున్నారని.. రైతుబంధు ఆపాలని అంటున్నారని మండిపడ్డారు. రైతుల జోలికి వస్తే కబర్డార్‌ అం‌టూ కాంగ్రెస్‌ను హెచ్చరించారు. రైతుబంధు ఇవ్వొద్దని ఎలక్షన్‌ ‌కమిషన్‌కు కాంగ్రెస్‌ ‌లేఖ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌తమని ఆగం చేసిందని కర్ణాటక రైతులు మొత్తుకుంటున్నారన్నారు. మూడు గంటల కరెంట్‌ ‌చాలని పీసీసీ ప్రెసిడెంట్‌ అం‌టున్నారని.. కాంగ్రెస్‌ ‌రైతుబంధు ఆపాలని కుట్ర చేస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు ఇచ్చిన నేత కేసీఆర్‌ అని చెప్పుకొచ్చారు. ఇది రైతుల పట్ల కేసీఆర్‌కు ఉన్న కమిట్‌మెంట్‌ అని అన్నారు. ఈసీకి కాంగ్రెస్‌ ఇచ్చిన లేఖను వాపస్‌ ‌తీసుకోవాలని.. తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ ‌క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *