రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి

బ్యాంకు రుణాలు పొందేందుకు కేంద్రం ‘గ్యారంటీ’
ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు

హర్యానా, ఫిబ్రవరి 16 : రైతులకు మేలు చేసే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల బ్యాంకు రుణాలకు తమ కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని తెలిపారు. రైతు ఉద్యమ నేపథ్యంలో హర్యానాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాలుగో రోజుకు చేరిన రైతుల ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హర్యానా రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ…కేంద్రంలోని తమ బీజేపీ ప్రభుత్వం రైతులకు ప్రయోజనాలు అందించేందుకు పనిచేస్తుందని అన్నారు

. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు కేంద్రం రైతులకు ‘గ్యారంటీ’ ఇచ్చిందని, ఇంతకు ముందు వాటిని తిరస్కరించారని ప్రధాని అన్నారు.  కాగా పంటకు కనీస మద్దతు(ఎంఎస్‌పీ) చట్టంతో సహా 12 హామీలను అమలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *