రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌…200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

  • నేడు మరో రెండు పథకాలను ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ రెడ్డి
  • దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొననున్న పార్టీ అగ్రనేత ప్రియాంకా  గాంధీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను నేడు సిఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం చేవెళ్ల బహిరంగ సభ నిర్వహించి సభా వేదికగా  కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంక గాంధీ చేతుల విూదుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ప్రియాంకా పర్యటన రద్దు కావటంతో సిఎం రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వం ఇచ్చిన రెండు గ్యారంటీలను ప్రారంభిం చనున్నారు. కాగా  ప్రియాంకా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *