‘‘కనీస వసతులు కరువు లైబ్రరీ, వర్క్‌షాప్ లాంటి మౌలిక సౌకర్యాలు లేని కాలేజీలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు కంప్యూ టర్, సాఫ్ట్‌వేర్ రంగాలలో నిత్యం కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలి. అది కొన్ని యాజమాన్యాలకు తలకు మించిన భారంగా ఉంది. తగిన అధ్యాపకులు దొరకడం కూడా కష్టం అవుతుంది. దాని ఫలితంగా అధిక శాతం ఇంజినీరింగ్ విద్యార్థులకు అదొక డిగ్రీలాగానే ఉపయోగపడుతున్నది. ఐదు, పది శాతం మాత్రమే ప్రైవేట్ కంపెనీలలో అత్యున్నత జీతభత్యాలతో చేరుతున్నారు. మిగిలిన 90 శాతం యేళ్ల తరబడి ఉద్యోగాల వేటలో ఉంటున్నారు.’’
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో మళ్లీ హాంగు ఆర్భాటాలతో ఇంజనీరింగ్ చదువులు హడావిడి మొదలయ్యాయి. ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇంజనీరింగ్ విద్యను వ్యాపారంగా మార్చి విద్య మరింత ప్రీయం అవుతుంది. ఒకవైపు ఇంజనీరింగ్ విద్యను చదువలేని పరిస్థితి ఉంటే .. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం లక్షలాది రూపాయలకు మేనేజ్మెంట్ సీట్లు అంగట్లో సరుకు లాగా అమ్ముకుంటున్నారని, కొన్ని కాలేజీలు నిబంధనలు పాటించకుండా వాటిని తుంగలో తొక్కుతున్నాయి. కాలంతో పాటు మానవ అవసరాలు కూడా మారిపోతున్నాయి. మారిన కాలానుగుణంగా సమాజం కూడా మార్పు చెందుతుంది. రాష్ట్రంలోని పేరున్న మంచి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఎంటెక్, ఎంబిఎ, ఎంసిఎ, వృత్తి విద్యా కోర్సులు చేయాలనుకునే వారికి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యా విషయంలో గత శతాబ్ద కాలంలో ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మూడు సంవత్సరాల క్రితం ఒక్కసారిగా ఇంజనీరింగ్ విద్యకు అత్యంత ప్రాధాన్యతను లభించింది. అంతకు ముందు ఇంజనీరింగ్ విద్య అనేది అత్యంత పరిమితంగా ఉండేది.
కేవలం అక్కడక్కడా కొద్దిపాటి కాలేజీలే మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రవేశంతో ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఇంజనీరింగ్ విద్యను ఎక్కడలేని ప్రాధాన్యత దక్కుతుంది. ఇంజనీరింగ్ చదువుపై ఉన్నత వర్గాల్లోనే కాదు. సామాన్య వర్గాలకు సైతం ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. అమెరికా లాంటి విదేశాలలో ఉద్యోగం, డాలర్ లో జీతం, ఇంకా దేశంలో కూడా పెద్ద పెద్ద మహానగరాల్లో అనేక సంస్థల్లో అత్యున్నత జీతం, హోదా, లభిస్తుందడంతో ఇంజనీరింగ్ పై రోజురోజుకు మోజు పెరిగిపోతుంది. దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. భారతదేశంలో 1947 లో 44 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే అందులో సీట్లు 3,200 మాత్రమే ఉండేది. ఇప్పుడు దాదాపు 3,500 పైగా కాలేజీల సంఖ్య పెరిగిపోయాయి. ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య దాదాపు పదిహేడున్నర లక్షలు దాటిపొయాయి. అయినా డిమాండ్ మొన్నటి వరకు విపరీతంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో పాటు సాఫ్ట్ వేర్ రంగానికి కొంత ప్రాముఖ్యత తగ్గడంతో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య పట్ల మోజు కూడా తగ్గింది. కేవలం ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించిన మాత్రాన ప్రతిష్టాకరమైన సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించడం అంత సులభం కాదనే విషయాన్ని విద్యార్థులు గ్రహిస్తున్నారు. అందుకే ఏడాది ఏడాదికి ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతున్నది. ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణలో దాదాపు 15 వేల సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. మరోపక్క ఇప్పటికే మరెన్నో కాలేజీలు మూతపడ్డాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ చివరి దశ సీట్ల కేటాయింపు కార్యక్రమం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 177 కాలేజీలో 79,346 ఇంజనీరింగ్ సీట్లలో 63, 900 మంది అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించగలిగారు. మిగిలిన సీట్ల భక్తి కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని కాలేజీలలో మాత్రం ఇంజనీరింగ్ సీట్లకు కూడా బాగానే డిమాండ్ ఉంది. నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న ఆ కాలేజీలలో సీట్ల కోసం కోసం పోటీ పడుతూనే ఉన్నారు. లక్షలాది రూపాయలు చెల్లించి ఎగబడుతున్నారు. ఈసారి ఇంజనీరింగ్ విద్యకు ఫీజులు భారీగా పెంచారు.
అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ అసమర్థత కారణంగా అంత ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అనుకున్నట్టే జరుగుతుంది. కోర్టును సైతం నమ్మించి ఇష్టానుసారంగా లక్షల రూపాయల ఫీజులను పెంచుకున్నారు. కమిటీ తన పని తాను చేయబోగా ఫీజుల పెంపునకు అనుమతించడం అంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం. రాష్ట్రంలో మొత్తం 1509 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు కనిష్టంగా రూపాయల 45,000 , గరిష్టంగా రూపాయలుగా లక్షా 60 వేల రూపాయల వరకు నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం కాలేజీలలో లక్ష రూపాయల ఫీజులు ఉన్న కాలేజీలో సుమారు 40 కి పైగా ఉన్నాయంటే ఫీజుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం మనం చేసుకోవచ్చు. అధిక శాతం కాలేజీలో నాణ్యత ప్రమాణాలు అంతకంతకు దిగజారుతున్నాయని విమర్శలు విద్యార్థులలో, తల్లిదండ్రులలో వినిపిస్తున్నాయి.
ఉత్తీర్ణులతో అవుతున్న 90 శాతం మంది గ్రాడ్యుయేట్ లో సాఫ్ట్ వేర్ పరిశ్రమలలో పనిచేసే నైపుణ్యం అంతగా లేదని ఆయా కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. కనీస వసతులు కరువు లైబ్రరీ, వర్క్‌షాప్ లాంటి మౌలిక సౌకర్యాలు లేని కాలేజీలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు కంప్యూ టర్, సాఫ్ట్‌వేర్ రంగాలలో నిత్యం కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలి. అది కొన్ని యాజమాన్యాలకు తలకు మించిన భారంగా ఉంది. తగిన అధ్యాపకులు దొరకడం కూడా కష్టం అవుతుంది. దాని ఫలితంగా అధిక శాతం ఇంజినీరింగ్ విద్యార్థులకు అదొక డిగ్రీలాగానే ఉపయోగపడుతున్నది. ఐదు, పది శాతం మాత్రమే ప్రైవేట్ కంపెనీలలో అత్యున్నత జీతభత్యాలతో చేరుతున్నారు. మిగిలిన 90 శాతం యేళ్ల తరబడి ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. ఉద్యోగం లభించక నిరాశతో కుమిలిపోతున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ లక్షల సంఖ్యలో ఉన్నారు.
ఇంజనీరింగ్క కళాశాలలో ప్రమాణాల పతనంతో విద్యార్థుల జీవితాలు అంధకారమవుతున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీలు వ్యాపారంగా రూపాంతరం చెందాయి. పక్షపాతం, అవినీతి, కుల, మత ప్రాతిపదికలు చదువుల నాణ్యతకు శాపంగా మారాయి. పట్టా చేతికి వస్తే చాలు తమ పిల్లలు అత్యంత సుఖవంత జీవితాన్ని గడుపుతారనే భ్రమను తల్లిదండ్రులు విడనాడాలి. విద్యను వ్యాపారంగా భావించే కోచింగ్ కేంద్రాలు, ఇంజినీరింగ్ కాలేజీలు యువతను మాయలో ముంచెత్తి వారి జీవితాలతో ఆటాడుకోవడం తప్ప మరోకటి కాదు. పెంచిన ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపడం ద్వారా వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ధనదాహం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వలన రోజు రోజుకు ఇంజనీర్ విద్య మరింత ప్రీయం అయ్యే ప్రమాదం ఉంది. మధ్యతరగతి రైతు కుటుంబాల పిల్లలు ఫీజుల దోపిడికి గురవువుతారు. పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇంజనీరింగ్ విద్యను అన్ని వర్గాల విద్యార్థులకు తక్షణమే అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలి
లాకవత్ చిరంజీవి నాయక్
కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్



