రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్‌ అలోక్‌ అరాధే

  • రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌
  • ‌హాజరయిన సిఎం కెసిఆర్‌, ‌తదితరులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణ హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్‌, ‌సిఎస్‌ ‌శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్‌ ‌తదితరులు హాజరయ్యారు.

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇక సిజెగా నియమితులైన జస్టిస్‌ అలోక్‌ అరాధే 1964 ఏప్రిల్‌ 13‌న రాయ్‌పూర్‌లో జన్మించారు. 1988 జూలై 12న న్యాయవాదిగా చేరగా 2009 డిసెంబర్‌ 29‌న మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయి అనంతరం 2016 సెప్టెంబర్‌ 16‌న జమ్మూకాశ్మీర్‌ ‌న్యామూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన ఆ రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీకి, లీగల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీకి చైర్మన్‌గా పనిచేశారు. జస్టిస్‌ అలోక్‌ అరాధే 2018లో మూడు నెలల పాటు జమ్మూ కాశ్మీర్‌ ‌హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2018 నవంబర్‌ 17 ‌నుంచి కర్నాటక హైకోర్టు జడ్జిగా కొనపాగుతూ కొంతకాలం కర్నాటక తాత్కాలిక సిజెగా పని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *