Take a fresh look at your lifestyle.

రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
ఇప్పటికే పలు జిల్లాల్లో జోరు వానలతో అతలాకుతలం
హైదరాబాద్‌లోనూ దంచికొట్టిన వర్షం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్‌, ‌మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో వరుసగా నాలుగోరోజు భారీవర్షం కురిసింది. పలుప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపైకి చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌ ‌జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ ‌హెచ్చరికలను జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌-‌మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే భారీవర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో మళ్లీ..: మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చంపాపేట్‌, ‌కర్మన్‌ఘాట్‌, ‌సరూర్‌నగర్‌, ‌కొత్తపేట, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ‌హయత్‌నగర్‌, ‌నాగోల్‌, ‌మన్సూరాబాద్‌, ‌వి•ర్‌పేట్‌, ‌బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్‌, అల్వాల్‌, ‌ప్యాట్నీ, చిలకలగూడ, లాలాపేట, నాచారం, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్స్, ‌చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్‌, ‌కవాడిగూడ, జవహర్‌నగర్‌, ‌రాంనగర్‌, ‌దోమలగూడ, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, లింగోజీగూడ, ఖైరతాబాద్‌, ‌లాలాపేట, నాచారం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Leave a Reply