రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై నేడు మమత చర్చలు

  • పలువురు సిఎంలు, నేతలకు ఆహ్వానం
  • తెరపైకి శరద్‌ ‌పవార్‌ ‌పేరు.. అంతలోనే తాను బరిలో లేనంటూ పవార్‌ ‌స్పష్టీకరణ

న్యూ దిల్లీ/ముంబై, జూన్‌ 14 : ‌రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు నేడు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో ప్రతిపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. వివిద పార్టీల నేతలు. సిఎంలతో మాఎ ఢిల్లీలో బుధవారం చర్చించనున్నారు. అయితే ఇదే సమయంలో తాను రాష్ట్రపతి రేసులో లేనని మరాఠా నేత శరద్‌ ‌పవర్‌ ‌స్పష్టం చేశారు. దేశంలోని అత్యంత సీనియర్‌ ‌రాజకీయ నాయకులలో ఒకరైన పవార్‌, ‌గత కొన్ని దశాబ్దాలుగా అనేక సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో, విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

ఈక్రమంలోరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై శరద్‌ ‌పవార్‌ ‌క్లారిటీ ఇచ్చారు. తాను రాష్ట్రపతి రేసులో లేనని చెప్పారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల అభ్యర్థిగా శరద్‌ ‌పవార్‌ ‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి లేదని చెప్పారు. ఈ విషయంపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన శరద్‌ ‌పవార్‌..‌రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాష్ట్రపతి రేస్‌ ‌నుంచి పవార్‌ ‌వెనక్కి తగ్గడంతో విపక్షాలు డైలమాలో పడ్డాయి. ఓడిపోయే పోరులో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పలువురు విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. భారత రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దింపాలనే ప్రతిపాదనను శరద్‌ ‌పవార్‌ ‌తిరస్కరించారని ఎన్సీపీ పార్టీ వర్గాల ద్వారా కూడా తెలిసింది. సోమవారం రాత్రి ముంబై నగరంలో జరిగిన నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ(ఎన్‌సీపీ) సమావేశంలో శరద్‌ ‌పవార్‌ ‌మాట్లాడారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *