- పొంగుతున్న వాగులు, వంకలు
- ఉపరితల ఆవర్తనం…చురుగ్గా రుతపవనాలు
- కొన్ని జిల్లాలకు భారీ వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ
- సూర్యాపేటలో భారీ వర్షం… ఆత్మకూరు మండలంలో 19 సెంటీవి•టర్లు నమోదు
- మహబూబ్‌నగర్ జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు…స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం…. వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. యాదాద్రి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆఫీస్‌లకు, స్కూళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతవరణశాఖ పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
ఇది సముద్రమట్టానికి 7.6 కిలోవి•టర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపునకు ఒంగి ఉంది. ఇంకా మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి వేర్వేరుగా విస్తరించాయి. అలాగే గుజరాత్ నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ వి•దుగా బంగాళాఖాతం వరకు రుతుపవనద్రోణి కొనసాగుతుంది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున పలుచోట్ల వర్షాలు కురిశాయి. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం ఉల్వనూరులో భారీ వర్షం కురిసింది. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గాలేకపోవడంతో వరదనీరు ఇళ్లలోకి చేరుతుంది. వరదతో పాటు విష సర్పాలు కూడా వొస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే వరద ఇండ్లలోకి చేరుతుందని చెబుతున్నారు. రాత్రి సమయంలో వాన పడితే కంటివి•ద కునుకు ఉండదని తెలిపారు. ప్రతి ఏటా వానాకాలంలో ఇదే పరిస్థితి అని…చిన్న పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కోరుతున్నారు.
సూర్యాపేటలో భారీ వర్షం… ఆత్మకూరు మండలంలో 19సెంటీవి•టర్లు నమోదు
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్)మండలంలో 19 సెంటీవి•టర్ల వర్షం కురిసింది. అలాగే తుంగతుర్తిలో 14 సెంటీవి•టర్లు, నడిగూడెంలో 13, మద్దిరాలలో 11, నాగారంలో 9 సెంటీవి•టర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది. నకిరేకల్ లో 9 సెం.వి•, నల్గొండలో 7, కేతేపల్లిలో 7, శాలిగౌరారంలో 7, తిప్పర్తిలో 6 సెంటీవి•టర్ల చొప్పున వర్షం పాతం నమోదు అయింది. అలాగే యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ధర్మారం చెరువు అలుగు పోస్తుండటంతో ధర్మారం – లక్ష్మిదేవి కాల్వ గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతొ సూర్యాపేట పట్టణంలోని కొన్ని కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. మానస నగర్, స్నేహనగర్ ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం అవస్థలు పడుతున్నారు. వాన నీరు స్వేచ్ఛగా ప్రవహించే అవకాశం లేకుండా.. నాలాలు ఆక్రమించుకొని ఇండ్లు కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. కేవలం ఒక్కసారి భారీ వర్షం పడితే చాలు కాలనీలు నీట మునిగే పరిస్థితి ఉందంటున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి వరద నీటిని క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు… స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మన్యకొండ రైల్వేస్టేషన్ దగ్గర స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. వర్షాల కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు వొచ్చింది. ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. కాగా బ్రిడ్జి మధ్యలోకి వెళ్లగానే వరద నీటిలో బస్సు నిలిచిపోయింది. దాదాపు సగం వరకు స్కూల్ బస్సు నీట మునిగింది. ఈ సమయంలో బస్సులో మొత్తం 30 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన స్థానికులు బస్సులోని విద్యార్థులను కాపాడారు. అనంతరం బస్సును తాళ్ల సాయంతో వెనక్కి తీసుకుని వచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు రామచంద్రాపురం నుంచి సుగూర్‌గడ్డతండాకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం…. వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు మృతి
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నల్లగొండ పట్టణంలో గురువారం రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో పద్మానగర్‌లోని ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం చెందారు. తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో గోడకూలి బీరువా వి•ద పడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21)గా గుర్తించారు. ఇటీవలే కళ్యాణికి వివాహం జరిగింది. ఆ కుటుంబం కొన్నేళ్లుగా శ్రీకాకుళం నుంచి వలస వచ్చి రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండలోని పానగల్ బైపాస్ వద్ద భారీగా చేరిన వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అటు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) 19.9 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో చండూరులో ప్రైవేట్ విద్యా సంస్థలకు శుక్రవారం యాజమాన్యం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై ఎమ్మెల్యే నోముల భగత్ స్పందించారు. లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతలలో నివసించే ప్రజలకు భారీ వర్షాల సమాచారం ఎప్పటి కప్పుడు అందజేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాదు.. వర్షాల వల్ల బలహీనంగా ఉండే చెరువు కట్టలు, పాత వంతెనలు, ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను హెచ్చరించారు.



