రాష్ట్రంలో మహిళాశక్తి క్యాంటీన్లు

ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సమీక్ష
ఇతర రాష్ట్రాల క్యాంటీన్ల పనితీరుపై ఆరా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి  క్యాంటీన్‌ సర్వీస్‌’లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడిరచారు. రాష్ట్రంలో క్యాంటీన్‌ సర్వీస్‌ల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సవ్నిక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్‌ స్టాండ్‌లు పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్‌లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే, ‘అన్న’ క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీకా రసోయ్‌ అనే పేరుతో బెంగాల్‌లో నడుస్తున్న క్యాంటీన్‌ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు.

రానున్న రెండేళ్లలో కనీసం150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడిరచారు. ఈ క్యాంటీన్‌ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్‌ నిర్వహణపై  ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు వివరించారు. ఈ క్యాంటీన్‌ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రావ్నిణాభివృద్ధి, పంచాయితీ రాజ్‌ శాఖ కమిషనర్‌ను సీఎస్‌ ఆదేశించారు. సమావేశానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పంచాయితీ రాజ్‌, గ్రావ్నిణాభివృద్ధి శాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌, ఆరోగ్య శాఖ కవ్నిషనర్‌ కర్ణన్‌, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కవ్నిషనర్‌ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్‌ నిఖిల, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ రమేష్‌ నాయుడు, తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *