పెట్టుబడి సాయంపై మంత్రి హరీష్ రావు ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : రాష్ట్రంలో మళ్లీ రైతు బంధు పండుగ మొదలైనట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. సోమవారం మంత్రి తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…రైతు బంధు స్కీమ్ కింద తెలంగాణ రైతులకు పెట్టుబడిగా ఇస్తున్న మద్దతు లక్షలాది మంది రైతులకు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు ఆయన తెలిపారు.
పదకొండవ విడుత రైతు బంధు ప్రారంభమైన సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ…రైతుల అభివృద్ధి, శ్రేయస్సే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇవాళ తొలి రోజు సందర్భంగా 645.52 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లోకి క్రెడిట్ చేస్తున్నట్లు మంత్రి హరీష్ వెల్లడించారు. జూన్ 26వ తేదీ రోజున సుమారు 22,55,081 మంది రైతలుకు రైతు బంధు అందినట్లు ఆయన చెప్పారు.




