రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశయుందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపటి నుండి రెండు రోసుల పాటు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరేంజ్‌ అలర్ట్ ‌జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఆదివారం దక్షిణ ఒడిశా సమీపంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిమీ ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు ఒక అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *