రాష్ట్రంలో తొలిసారిగా సిద్ధిపేటలో… సర్కారు హాస్పిటల్‌పై ఆత్మవిశ్వాసం నింపే ఆసరా..

2 వాహనాలతో ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు
వయో వృద్ధులకు ఆత్మీయ భరోసా
నేడు మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ఆలన కేంద్రం ప్రారంభం

image.png
image.png
image.png
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో సర్కార్‌ ‌దవాఖానఅంటే ఒక నమ్మకం. విశ్వాసం పెంచే దిశగా రాష్ట్ర ఆరోగ్య శాఖ  మంత్రి తన్నీరు హరీష్‌రావు  ప్రత్యేక చొరవతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వైద్య సిబ్బంది.. వైద్యులు.. వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో పాటు.. అన్ని రకాల వ్యాధులు ప్రభుత్వ దవాఖానలో జరగాలని సిఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశంతో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజారోగ్యానికి ప్రాధాన్యత తెస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, వయో వృద్ధులకు ఒక వైపు ఆలనగా దవాఖానలోనే సేవలు అందించే గొప్ప కార్యక్రమం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ప్రారంభం కానుంది. నేడు(శనివారం) మంత్రి హరీష్‌రావు ప్రారంభించనున్నారు.
చివరి శ్వాసలో కూడా ఆత్మవిశ్వాసం…
వృద్ధాప్యంలో ఉన్న, దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్న వ్యాధి గ్రస్థులకు చివరి శ్వాసలో కూడా ఆత్మీయ భరిసా..ఆత్మవిశ్వాసం నింపే కేంద్రం ఆలనా మంత్రి హరీష్‌రావు  చొరవతో ప్రత్యేక కేంద్రం ఏర్పాటైంది.
ఏడు బెడ్లతో…సేవలు
సిద్ధిపేట జిజిహెచ్‌లోని 4వ ఫ్లోర్‌లో పాలియేటివ్‌ ‌కేర్‌ ‌కేంద్రాన్ని ఏడు బెడ్ల కెపాసిటీతో ఏర్పాటు చేస్తున్నారు.  ఈ కేంద్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి సేవలు అందించనున్నారు. కేన్సర్‌, ‌పక్షవాతం, రోడ్డు ప్రమాదాలతో మంచానికే పరిమితమైన వారి బాధ మాటల్లో చెప్పలేం. వీరు శారీరకంగా ఎన్నో చిత్రహింసలకు గురవుతుంటారు. ఇలాంటి వారికి కేంద్రంలో సేవలు అందించనున్నారు. కేన్సర్‌ ఉన్న వారికి కంతులు పెరుగుతుండడం నిరంతరం మంచంపై పడుకోవడం వల్ల చర్మం కమిలిపోవడం, ఇతర ఇన్ఫెక్షన్స్‌తో కొత్త గాయాలు కావడం సర్వసాధారణం. అంతే కాకుండా, రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న వారు మంచంపైనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వీరికి మానసిక స్థైర్యం పెంపొందించేలా కేన్సర్‌, ఇతర దీర్ఘకాలిక బాధిత కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ‌చేస్తారు. వ్యాధి తీవ్రత మేర హాస్పిటల్‌లో చికిత్స పొందాల్సిందిగా సూచనలు చేస్తారు. నొప్పి నుంచి ఉపశమనం ఎలా పొందాలి… ఆయా గాయాలకు డ్రెస్సింగ్‌ ఎలా చేసుకోవాలో ఈ కేంద్రం ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.
 కేంద్రంలోనే కుటుంబ సభ్యుల్లో ఒకరిక శిక్షణ ఇస్తారు. ఇది పేదలకు ఎంతో  ప్రయోజనం. అత్యవసరమైతే కేర్‌ ‌సెంటర్లోనే జాయిన్‌ ‌చేసుకొని రెండు నుంచి మూడు వారాల పాటు పౌష్టికాహారంతో పాటు మందులు ఉచితంగా అందించనున్నారు. దీంతో పేద వర్గాలకు ఈ సదుపాయం ఎంతో ప్రయోజనం కలిగించనుంది. గజ్వేల్‌లో ప్రారంభంకాక ముందు ఆయా ప్రాంతాల వారు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ప్రభుత్వ కేన్సర్‌ ‌దవాఖానతో పాటు కార్పొరేట్‌ ‌దవాఖానలకు వెళ్లేవారు. సిద్దిపేటలో పాలియేటివ్‌ ‌కేర్‌ ‌కేంద్రం అందుబాటులోకి రానుండడంతో దీర్ఘకాలిక రోగులకు ఎంతో దోహదపడనుంది. కేంద్రంలోని ఒక పాలిటివ్‌ ‌కేర్‌ ‌ఫిజిషియన్తో పాటు ఒక ఫిజియో థెరపిస్ట్, ఐదుగురు స్టాఫ్‌ ‌నర్సులు ఉండనున్నారు. వీరు కేంద్రంతో పాటు ఇంటింటికీ వెళ్లి శిక్షణ ఇవ్వనున్నారు.
ఆరోగ్యానికి ఆసరాగా…వయోవృద్దుల సేవలు
రాష్ట్రంలో తొలిసారిగా వయో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఫిజియోథెరపీ, ఇంటి వద్దకు వెళ్లి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసింది. ఒక వైపు ఆలనా వాహనం ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందిన వారికి 3 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి అవసరమగు చికిత్స చేస్తూ..మరో వైపు ఆసరా వాహనము ద్వారా ఇంటి వద్దకు వెళ్లి తీసుక రావడం..హాస్పిటల్‌ ‌నుండి ఇంటికి క్షేమంగా చేర్చే గొప్ప కార్యక్రమం చేపట్టారు. మంత్రి హరీష్‌రావు చొరవతో  సిద్దిపేట దవాఖానలో త్వరలో ప్రారంభం కానుంది.
ఆసరా సేవలు..
65 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు సకల సౌకర్యాలు సిద్ధిపేట ప్రభుత్వ దవాఖానలో లభిస్తున్నాయి. ఇంటివద్ద సేవలు, పిజియోథెరపీ  ప్రస్తుతం లేవు ఇలాంటి సేవలు  కావాలని మంత్రి  హరీష్‌రావు  ప్రత్యేక దృష్టితో  ప్రభుత్వ హాస్పిటళ్లలో సర్జరీలు, ఇతర వైద్య సేవలు చికిత్స చేసిన డాక్టర్‌ ‌సూచన మేరకు పిజియోథెరపీ, ఇంటి వద్దే సేవలు అందించాలని సూచించారు. అందుకు అనుగుణంగా, సిద్ధిపేట జిజిహెచ్‌ 65 ‌సంవత్సరాలు పైబడిన వయోవృద్దుల కోసం ప్రత్యేక పిజియోథెరపీ, ఇంటివద్దే సేవలు అందించే కార్యక్రమం ‘ఆసరా’ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కేంద్రం ద్వారా జిజిహెచ్‌ ‌సిద్ధిపేటలో చికిత్స పొంది, డాక్టర్‌ ‌సూచన మేరకు ఇద్దరు స్టాఫ్‌ ‌నర్సులు, ఒక పిజియోథెరపిస్ట్ ‌సేవలు అందిస్తారు. ఈ సేవలు అవసరమైన వారు రూమ్‌ ‌నెంబర్‌ 14‌లో నమోదు చేసుకోవాలి. వారంలో 3 రోజులపాటు దవాఖానలో, మిగతా మూడు రోజులు గృహా సందర్శన సేవలు అందిస్తారు. ఇందుకోరకై ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్‌ ‌సూచన మేరకు ఇంటి వద్దే  రక్త నమూనాలను సేకరించి  సిద్దిపేట టిహబ్‌లో పరీక్షలు చేసి నివేదికలు అందజేస్తారు. తదనుగుణంగా చికిత్స అందిస్తారు.
మానసిక ప్రశాంతతనే సంపూర్ణ ఆరోగ్యం : మంత్రి హరీష్‌రావు
వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాదులతో సతమతమవుతున్న రోగులకు ఆర్థిక స్థోమత లేని వారికి ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత కంటే సంపూర్ణ ఆరోగ్యం లేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆత్మీయ పకరింపు, సేవ, ఆదరించే విధంగా ఆరోగ్య సేవలు, ఇక్కడే పౌష్టికాహారం, జావా లాంటివి ఇచ్చే గొప్ప కార్యక్రమం ఆలనా కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. చివరి శ్వాసలో కూడా వారి మానసికంగా మనోధైర్యం ఇవ్వడం కంటే గొప్ప ఆరోగ్యం లేదని మంత్రి హరీష్‌రావు చెప్పారు. అలాంటి గొప్ప సేవా భావం నేడు ప్రభుత్వ దవాఖానలో జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇది పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *