రాష్ట్రంలో డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువయ్యాయి

8.97 శాతం పెరిగిన నేరాలు
డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టం
తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : రాష్ట్ర వార్షిక నేర నివేదిక 2023ను డీజీపీ రవి గుప్తా వెల్లడిరచారు. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సమాజంలో డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువ అయ్యాయని ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు డ్రగ్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.

డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టమని హెచ్చరించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. 41 శాతం కోర్టు శిక్షలు పెరిగాయని డీజీపీ పేర్కొన్నారు. 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించామన్నారు. సోషల్‌ మీడియా ద్వారా 1 లక్షా 38 వేల ఫిర్యాదులు అందాయన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌ విజయవంతగా నడుస్తుందన్నారు. రాష్ట్రంలో 100, 112 కు 16 లక్షల ఫోన్‌ కాల్స్‌ వొచ్చాయని ..7 నిమిషాల్లో రెస్పాండ్‌ అయ్యామని డీజీపీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *