- వొచ్చే 3 రోజులు వానలు కురిసే అవకాశం
- పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్.!
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతుంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అవర్తనం ఏర్పడిరదని.. దీని కారణంగా రాష్ట్రంలో వొచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. బుధవారం..రాష్
ఉరుములు, మెరుపులు, 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం.. ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గత ఏడాదిలా కాకుండా ఈసారి తెలుగు రాష్ట్రాలను గట్టిగా పలకరిస్తామంటున్నాయి నైరుతి రుతుపవనాలు. విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరిస్తుందంటోంది. ఈనెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతు పవనాలు తాకుతాయి. ఆ తర్వాత కేరళను పలకరించి.. తెలుగు రాష్ట్రాలకు చల్లని మబ్బులు దూసుకొస్తాయి.





