రాజీనామాకు కట్టుబడి ఉన్నా..

అయితే..అన్ని హామీలు అమలు చేస్తేనే
రాజీనామా డిమాండ్‌పై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు జవాబు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, రుణమాఫీపై తాను చెప్పినట్లుగానే రాజీనామా చేస్తా కానీ రేవంత్‌ ‌ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేయాలని హరీష్‌ ‌రావు సవాల్‌ ‌విసిరారు. ఆగస్ట్ 15‌లోపు రైతు రుణమాఫీ హావి•ని అమలు చేస్తే హరీష్‌ ‌రావు రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ ‌విసిరారని, ఆ సంగతేంటో ముందు చెప్పాలని సోషల్‌ ‌వి•డియాలో కాంగ్రెస్‌ ‌హడావిడి చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రశ్నలకు హరీష్‌ ‌తాజాగా సమాధానమిచ్చారు.

తానిప్పటికీ రాజీనామా ఛాలెంజ్‌కి కట్టుబడి ఉన్నానని, అయితే తాను చెప్పినట్టుగా కాంగ్రెస్‌ అన్ని హావి•లు అమలు చేయాలని అన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలతోపాటు 13 హావి•లను కూడా అమలు చేయాలని డిమాండ్‌ ‌చేసారు.  రైతు రుణమాఫీ సహా, అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా అమలు చేస్తామన్న హావి•లన్నిటినీ నెరవేరిస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానన్నారు.

హరీష్‌ ‌రావు. ఆగస్ట్-15‌లోపు రుణమాఫీ పూర్తి చేయాలని, దానితోపాటు ఆరు గ్యారెంటీలు, 13 హావి•లు అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తనకు పదవి ముఖ్యం కాదని, తన పదవి పోయినా ప్రజలకు న్యాయం జరిగితే అదే సంతోషమని అన్నారు హరీష్‌ ‌రావు. తన ఛాలెంజ్‌ ‌స్వీకరించి అయినా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హావి•లు అమలు చేస్తే చాలన్నారు. కేవలం రైతు రుణమాఫీపైనే తాను మాట్లాడలేదని, హావి•లన్నీ అమలు చేస్తేనే రాజీనామా అని చెప్పానని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *